చాలామందికి మంగళవారం అశుభం.. కొందరికీ శుభం.. కానీ కొందరికి అదో సామెత.. అసలు మంగళ వారంతో ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి ఏం చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో దర్శకుడిగా అజయ్ భూపతి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. యూత్‌కి ఆ సినిమా బాగా కనెక్ట్ అయింది. కానీ ఆ తరువాత చేసిన ‘మహా సముద్రం’ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. అందుకే కొంత గ్యాప్ తర్వాత డిఫరెంట్ టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు. ఆ కథ పేరే ‘మంగళవారం’. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ అండ్ కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. అది కూడా మంగళవారమే ఈ పోస్టర్‌ను వదిలాడు. ఇందులో హీరోయిన్ను డార్క్ మోడ్‌లో చూపిస్తూ.. సీతాకోకచిలుక మాదిరిగా చూపించాడు. కానీ ఆమె ఎవరనేది రివీల్ చేయలేదు. ఆ హాట్ బ్యూటీ ఆర్ఎక్స్ 100 భామనే అని తెలుస్తోంది. అసలు పాయల్ రాజ్‌పుత్.. పేరు వింటేనే కుర్రాళ్ల గుండెల్లో దడపుడుతుంది.. ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయి.. ఆమె ఫిగర్‌కు దాసోహం కానీ వారు ఉండరేమో.. ఫస్ట్ సినిమా ఆర్ఎక్స్ 100తో అలా కట్టిపడేసింది అమ్మడు. అయితే ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకున్నప్పటికీ.. క్లిక్ కాలేకపోయింది. ఇక ఇప్పుడు మరోసారి అజయ్ భూపతి సినిమాలో నటిస్తోంది. కాబట్టి ఈ ఇద్దరి ఆశలన్నీ మంగళవారం మీదే ఉన్నాయి. ఈ సినిమా ఇంతవరకు ఎవరు టచ్ చేయని జోనర్లో ఉంటుందని అంటున్నాడు అజయ్ భూపతి చెప్పారు. అంతేకాదు.. సినిమాలో దాదాపు 30 పాత్రలు ఉంటాయని, అవి సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని అంటున్నారు. టైటిల్ అండ్ పోస్టర్ కూడా కొత్తగా ఉండడంతో.. అజయ్ భూపతి, పాయల్ సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యేలానే ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ జరుపుకుంటోంది. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.