Natural Star నాని ‘దసరా’ ట్రైలర్ డేట్ ఫిక్స్ అయిందా!?
Natural Star : ఈ మధ్య సినిమాల ఫస్ట్ డే ఓపెనింగ్స్ పై టీజర్, ట్రైలర్ ఇంపాక్ట్ గట్టిగా ఉంటుంది. టీజర్, ట్రైలర్‌తో అట్రాక్ట్ చేస్తే చాలు.. ఆటోమేటిక్‌గా సోషల్ మీడియానే సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేసేస్తుంది. లేదంటే మేకర్స్.. బజ్ కాదు కదా, దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సిందే.
ఈ మధ్య సినిమాల ఫస్ట్ డే ఓపెనింగ్స్ పై టీజర్, ట్రైలర్ ఇంపాక్ట్ గట్టిగా ఉంటుంది. టీజర్, ట్రైలర్‌తో అట్రాక్ట్ చేస్తే చాలు.. ఆటోమేటిక్‌గా సోషల్ మీడియానే సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేసేస్తుంది. లేదంటే మేకర్స్.. బజ్ కాదు కదా, దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సిందే. అందుకే.. ఏ సినిమా తీసుకున్నా.. టీజర్ అదిరిపోయేలా కట్ చేయాల్సిందే. నాని దసరా చిత్ర యూనిట్ ఈ విషయంలో ఫుల్లుగా సక్సెస్ అయింది. టీజర్‌తోనే ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది దసరా. డిస్ట్రీబ్యూటర్స్ థియేట్రికల్ రైట్స్ కోసం ఎగబడ్డారు.. దెబ్బకు దసరా బిజినెస్ డబుల్ అయింది. సినిమా రిలీజ్‌కు ముందే.. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు బ్లాంక్ చెక్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యాయి బడా బడా నిర్మాణ సంస్థలు. ఇక సినిమా హిట్ అయితే.. ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నాని కూడా ఆర్ఆర్ఆర్, కెజియఫ్, కాంతార సినిమాలతో పోలుస్తూ.. భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాడు. అయితే టీజర్లో జస్ట్ కొన్ని కీ షాట్స్ మాత్రమే చూపించారు. నాని మాస్ లుక్ ఆడియెన్స్‌కు తెగ నచ్చేసింది. అయితే కథ పై క్లారిటీ రావాలంటే.. ట్రైలర్ రావాల్సిందే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం దసరా ట్రైలర్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. మార్చి 30న పాన్ ఇండియా లెవల్లో దసరా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. మార్చి 16న దసరా ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే టీజర్‌తో అంచనాలు పెంచేసుకున్న మూవీ లవర్స్.. ట్రైలర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ట్రైలర్లోనే కీర్తి సురేష్ ‘వెన్నెల’ మాస్ లుక్‌ను రివీల్ చేయబోతున్నారు. మరి నాని ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.