న్యాచురల్ స్టార్ నాని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర స్లోగా స్టార్ట్ అవుతాయి కానీ.. ఆ తర్వాత మెల్లగా పుంజుకుంటాయి. ప్రస్తుతం హాయ్ నాన్న పరిస్థితి కూడా అలాగే ఉంది. మొత్తంగా నాలుగు రోజుల్లో ఊహించని వసూళ్లను రాబట్టింది హాయ్ నాన్న.
Nani: దసరా వంటి మాస్ సినిమా తర్వాత కంప్లీట్‌గా క్లాస్ లుక్‌లోకి వచ్చి న్యాచురల్ స్టార్ నాని (Nani) చేసిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న. సీతారామం తర్వాత మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాతో.. శౌర్యువ్ అనే మరో టాలెంటెడ్ డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ సినిమా చూసిన తర్వాత సెలబ్రిటీస్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కూడా హాయ్ నాన్నకు ఫిదా అయిపోయాడు. ‘హాయ్ నాన్న టీమ్‌కు నా అభినందనలు చెబుతూ.. నిజంగా ఈ సినిమా హార్ట్ టచింగ్‌గా ఉంది. నాని (Nani) , మృణాల్ యాక్టింగ్ అదుర్స్.. బేబీ కియారా.. నీ క్యూట్ నెస్‌తో హృదయాలను కొల్లగొట్టేశావ్.. దర్శకుడు శౌర్యువ్ ఫస్ట్ సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నావు.. అని ట్విట్టర్లో రాసుకొచ్చాడు. బన్నీ ట్వీట్‌కు రిప్లే ఇస్తూ.. థ్యాంక్స్ చెప్పాడు నాని. అర్హ నాన్న సినిమాను అప్రూవ్ చేశారు. థాంక్యూ బన్నీ.. మంచి సినిమా కోసం బన్నీ ఎప్పుడూ ఉంటారు.. అని అన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న హాయ్ నాన్న భారీ వసూళ్లను రాబడుతోంది. డే వన్ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న హాయ్ నాన్న.. ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాబట్టలేకపోయింది. ఫస్డ్ డే పది కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేకపోయింది. డే వన్ కన్నా డే 2, డే 3, డే 4 భారీ వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా శని, ఆది వారాల్లో దుమ్ముదులిపేసింది హాయ్ నాన్న. ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యే వరకు.. నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 40 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్.. 19 కోట్లకు పైగా షేర్ వసూళ్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. ముఖ్యంగా ఓవర్సీస్లో భారీ వసూళ్లను రాబడుతోంది. దీంతో 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అయిన హాయ్ నాన్న.. సెకండ్ వీకెండ్ వరకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవడం పక్కాగా కనిపిస్తోంది. ఏదేమైనా.. మౌత్ టాక్‌తో బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతోంది.