‘Guntur Karam’ నుంచి కొత్త సాంగ్ ప్రోమో రిలీజ్.. ఓ మై బేబీ అదిరింది!
ఫస్ట్ సింగిల్ దమ్ మసాలా తర్వాత సెకండ్ సింగిల్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు ఘట్టమనేని అభిమానులకు. ఎట్టకేలకు గుంటూరు కారం నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో బయటికి వచ్చేసింది. ఓ మై బేబీ.. అంటూ మహేష్, శ్రీలీల అదరగొట్టేశారు.
Guntur Karam: రిలీజ్‌కు మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది. అయినా ఇంకా షూటింగ్ జరుపుకుంటునే ఉంది మహేష్ బాబు ‘గుంటూరు కారం’ (Guntur Karam). మహేష్ బాబు, శ్రీలీల పై ఓ సాంగ్ షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడితో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసి.. ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ వెకేషన్‌కు వెళ్లనున్నాడు మహేష్ బాబు. తిరిగొచ్చిన తర్వాత గుంటూరు కారం (Guntur Karam) ప్రమోషన్స్ చేయనున్నాడు. ఇప్పటికే గుంటూరు కారం నుంచి మాస్ స్ట్రైక్ బయటికి రాగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అలాగే దమ్ మసాలా బిర్యానీ సాంగ్ కూడా మాసివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు సెకండ్ సాంగ్ రిలీజ్‌కు రెడీ అవుతున్నారు మేకర్స్. ‘ఓ మై బేబీ’ అంటూ సాగే ఈ పాటను డిసెంబర్ 13న రిలీజ్ చేయనుండగా.. ముందుగా ప్రోమో రిలీజ్ చేశారు.
మహేష్ బాబు, శ్రీలీలపై ఈ సాంగ్ కంపోజ్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మహేష్ బాబు, శ్రీలీల జోడిని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఈగర్‌గా వెయిట్ చేసేలా చేస్తోంది ఈ ప్రోమో. ముఖ్యంగా మహేష్ లుక్ మాత్రం మామూలుగా లేదు. టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించిన ఈ మెలోడీ సాంగ్ అదిరిపోయేలా ఉంటుందని ప్రోమోతో చెప్పేశారు. ఇక ఇప్పటి నుంచి గుంటూరు కారం నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ వస్తునే ఉంటాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12 గుంటూరు కారం రిలీజ్ కానుంది. ఈ సినిమాలో శ్రీలీలతో పాటు మరో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి కూడా నటిస్తోంది.
గుంటూరు మిర్చి యాడ్ బ్యాక్ డ్రాప్లో సినిమా తెరకెక్కుతోంది. అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్‌కి సరిపడే సరికొత్త సబ్జెక్ట్‌తో త్రివిక్రమ్ సినిమాను ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారు భారీ ఎత్తున ఈ మూవీను నిర్మిస్తున్నారు. మరి గుంటూరు కారం ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి.