Allu Arjun : పుష్ప సినిమాతో స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. అలాగే ఊహించని విధంగా పాన్ ఇండియా స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా బాలీవుడ్ జనాలు బన్నీ మాసివ్ పర్ఫార్మెన్స్కు ఫిదా అయిపోయారు. అందుకే అంతకుమించి అనేలా పుష్ప2ని ప్లాన్ చేస్తున్నారు.
పుష్ప సినిమాతో స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. అలాగే ఊహించని విధంగా పాన్ ఇండియా స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా బాలీవుడ్ జనాలు బన్నీ మాసివ్ పర్ఫార్మెన్స్కు ఫిదా అయిపోయారు. అందుకే అంతకుమించి అనేలా పుష్ప2ని ప్లాన్ చేస్తున్నారు. సుకుమార్ అస్సలు తగ్గేదేలే అంటున్నాడు. పుష్ప మూవీకి వచ్చిన ఫుల్ రన్ కలెక్షన్స్.. అంటే దాదాపుగా 400 కోట్లతో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మోస్ట్ అవైటేడ్ హిట్ సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. రీసెంట్గా హీరోయిన్ రష్మిక మందన షూటింగ్లో జాయిన్ అయింది. తాజాగా భన్వర్ సింగ్ షెకావత్‌గా నటించిన మళయాళ హీరో ఫహద్ ఫాజిల్ కూడా.. షూటింగ్లో జాయిన్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హైదారాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. సౌత్ ఇండియా హీరోల్లో.. సోషల్ మీడియాలో హైయెస్ట్ ఫాలోవర్స్ ఉన్న హీరోల జాబితాలో టాప్ ప్లేస్‌లో నిలిచాడు బన్నీ. తాజాగా ఐకాన్ స్టార్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 20 మిలియన్స్ మార్క్ అందుకుంది. పుష్ప రిలీజ్‌కి ముందు 12 మిలియన్స్ ఇన్‌స్టా ఫాలోవర్స్ ఉన్న బన్నీ.. ఇప్పుడు ఏకంగా 20 మిలియన్స్ క్లబ్‌లోకి చేరడం విశేషం. ఈ లెక్కన పుష్ప మూవీతో బన్నీకి ఎంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే.. సౌత్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోగా బన్నీ నిలిచాడు. మరి ఈ మార్క్‌ను నెక్స్ట్ ఎవరు టచ్ చేస్తారో చూడాలి.