'SIR' : కరోనా కాలంలో ఓటిటికి బాగా అలవాటు పడిపయారు జనాలు. ఓటిటి సంస్థలు కూడా సరికొత్త కంటెంట్‌తో ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి. అలాగే థియేటర్స్‌లో రిలీజ్ అయిన సినిమాలను.. భారీ రేటు చెల్లించి ఓటిటి రైట్స్ సొంతం చేసుకుంటున్నాయి.
కరోనా కాలంలో ఓటిటికి బాగా అలవాటు పడిపయారు జనాలు. ఓటిటి సంస్థలు కూడా సరికొత్త కంటెంట్‌తో ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి. అలాగే థియేటర్స్‌లో రిలీజ్ అయిన సినిమాలను.. భారీ రేటు చెల్లించి ఓటిటి రైట్స్ సొంతం చేసుకుంటున్నాయి. రిజల్ట్‌ను బట్టి మూడు వారాల నుంచి యాభై రోజుల్లో ఓటిటిలోకి వచ్చేలా డీల్ చేసుకుంటున్నాయి. తాజాగా సార్ మూవీ ఓటిటి డేట్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ ధనుష్ చేసిన తెలుగు స్ట్రెయిట్ ఫిల్మ్ సార్. తెలుగు, తమిళ్ భాషల్లో ఫిబ్రవరి 17న రిలీజ్ అయినా ఈ సినిమా.. డే వన్ నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో పది రోజుల్లో 15 కోట్లకు పైగా షేర్ అందుకుందని ట్రేడ్ వర్గాల మాట. అలాగే తమిళ్లో భారీ వసూళ్లను రాబడుతోంది. మొత్తంగా సార్ మూవీ ధనుష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకెళ్తుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై ఈ సినిమా తెరకెక్కింది. మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. ఇక ‘సార్’ కోసం థియేటర్లకు వెళ్లలేకపోయినా ఆడియెన్స్ ఓటిటి డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఇంకా థియేటర్ రన్నింగ్‌లో ఉండగానే ‘సార్’ ఓటిటి రిలీజ్ డేట్ లాక్ అయినట్టు తెలుస్తోంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ రేటుకు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా టాక్ ప్రకారం.. మార్చి 22 నుంచి ఈ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. అయితే ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.