Vikram-Kaarthi : లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియన్ సెల్వన్' రెండు భాగాలుగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. విక్రమ్, కార్తి, జయంరవి, ఐశ్వర్యరాయ్, త్రిషతో పాటు కోలీవుడ్‌కు చెందిన టాప్ స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. గతేడాది సెప్టెంబర్ 30న పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున రిలీజ్ అయింది ఫస్ట్ పార్ట్.
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ రెండు భాగాలుగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. విక్రమ్, కార్తి, జయంరవి, ఐశ్వర్యరాయ్, త్రిషతో పాటు కోలీవుడ్‌కు చెందిన టాప్ స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. గతేడాది సెప్టెంబర్ 30న పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున రిలీజ్ అయింది ఫస్ట్ పార్ట్. అయితే అనుకున్నంత రేంజ్లో ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. కానీ తమిళ్లో మాత్రం భారీ విజయాన్ని అందుకుంది. మొత్తంగా ఐదు వందల కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. దాంతో సెకండ్ పార్ట్ కోసం తమిళ తంబీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టే.. ఏ మాత్రం లేట్ చేయకుండా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 2023 ఏప్రిల్ 28న పొన్నియన్ సెల్వన్2ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. ఇప్పటికే ఈ సీక్వెల్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అయితే ఈ మధ్యలో పీస్2 పోస్ట్ అవనుందనే న్యూస్ వినిపించింది. దాంతో మరోసారి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా అనుకున్న సమయానికే వస్తుందని ఓ వీడియో ద్వారా ప్రకటించారు. దీంతో ఈ సినిమా రిలీజ్లో ఎలాంటి మార్పు లేదనే చెప్పాలి. ఇక ఫస్ట్ పార్ట్‌లో విక్రమ్, కార్తి, జయం రవి నటనతో పాటు ఐశ్వర్యరాయ్, త్రిష్ గ్లామర్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. విజువల్స్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మద్రాస్ స్టూడియోస్ పతాకంపై మణిరత్నం ఈ సినిమాను నిర్మించారు.. ఏ.ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించాడు. మరి ఈసారైనా పొన్నియన్ సెల్వన్ పాన్ ఇండియా లెవల్లో ఆకట్టుకుంటుందేమో చూడాలి.