Ram : ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. షాక్ ఇవ్వబోతున్నారా అంటే, ఇండస్ట్రీ వర్గాల్లో ఔననే వినిపిస్తోంది. ఇప్పటి వరకు బోయపాటి చేసిన సినిమాలు.. పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కాయి.
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. షాక్ ఇవ్వబోతున్నారా అంటే, ఇండస్ట్రీ వర్గాల్లో ఔననే వినిపిస్తోంది. ఇప్పటి వరకు బోయపాటి చేసిన సినిమాలు.. పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కాయి. ముఖ్యంగా బాలయ్యతో.. సింహా, లెజెండ్, అఖండ సినిమాల్లో పవర్ ఫుల్ డ్యూయెల్ రోల్స్ చేయించాడు బోయపాటి. ఇక ఇప్పుడు రామ్తోను డబుల్ డోస్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్‌తో మాసివ్ హిట్ అందుకున్న రామ్.. ఆ తర్వాత ‘రెడ్’, ‘ది వారియర్’ సినిమాలతో ఆకట్టుకోలేకపోయాడు. అందుకే బోయపాటి పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. అది కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. రామ్, బోయపాటి ఇద్దరి కెరీర్లో ఇదే హైయెస్ట్ బడ్జెట్ చిత్రం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో.. ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు.. రామ్ ఈ సినిమాలో రెండు భిన్నమైన పాత్రలలో నటిస్తున్నాడని మాత్రమే తెలుసు. అందులో ఒకటి లెక్చరర్ అనే టాక్ ఉంది. అయితే మరో క్యారెక్ట్ గురించి ఎలాంటి లీకేజీ లేదు. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. రామ్ 50 ఏళ్ళ మధ్య వయస్కుడిగా నటిస్తున్నాడని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తండ్రి పాత్రలో 50 ఏళ్ళ వ్యక్తిగా కనిపించనున్నాడట. ఈ పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందట. ఇప్పటికే రామ్ ఆ పాత్ర కోసం కసరత్తులు మొదలు పెట్టేశాడట. ఖచ్చితంగా ఈ రోల్.. సినిమాలో షాక్ ఇచ్చేలా.. బిగ్ సర్ప్రైజింగ్గా ఉంటుందని ఇండస్ట్రీ టాక్. మరి రామ్ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్డమ్ అందుకుంటాడేమో చూడాలి.