ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. బాలీవుడ్ హీరోయిన్స్ కియారా అద్వానీ, కృతి సనన్ తో పాటు ప్రముఖ సింగర్ సందడి చేశారు. కియారా, కృతి నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అనంతరం డబ్ల్యూపీఎల్ తొిలి సీజన్ లో తొలి మ్యాచ్ ముంబయి, గుజరాత్ జట్ల మధ్య జరిగింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో హర్మన్ ప్రీత్ సారథ్యంలో ముంబయి జట్టు అద్భుతంగా రాణించింది. దీంతో 142 పరుగుల భారీ ఆధిక్యంతో గుజరాత్ పై విజయం సాధించింది.
మహిళల క్రికెట్ చరిత్రలో నవశకం ప్రారంభం కాబోతుంది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్ నేడు అట్టహాసంగా ప్రారంభం కానుంది. 23 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో ఐదు జట్లు 22 మ్యాచ్‌లు ఆడనున్నాయి. 87 మంది మహిళ క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు
డబ్ల్యూపీఎల్ తొలి సీజన్లో ముంబయి (కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్), బెంగళూరు (కెప్టెన్ స్మృతి మంధాన), గుజరాత్ (కెప్టెన్ బెత్ మూనీ), యూపీ (కెప్టెన్ అలీసా హీలీ), ఢిల్లీ (కెప్టెన్ మెగ్ లానింగ్) జట్లు పోటీ పడనున్నాయి.
ఈ సీజన్లో అన్ని మ్యాచ్‌లనూ ఉచితంగా వీక్షించే అవకాశాన్ని మహిళలు, బాలికలకు బీసీసీఐ కల్పిస్తోంది. అమ్మాయిలు ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే స్టేడియాలకు వెళ్లి మ్యాచ్ లను ప్రత్యక్షంగా వీక్షించొచ్చు.