ఎప్పుడైతే మెగాస్టార్ చిరంజీవి.. చరణ్ తండ్రి కాబోతున్నాడనే వార్తను అభిమానులతో పంచుకున్నారో.. అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మామూలుగానే స్టార్ హీరోల అభిమానులకు ఆతృత కాస్త ఎక్కువగా ఉంటుంది. అందుకు తగ్గట్టే ఇండస్ట్రీ వర్గాల ప్రచారం.. మరింత టెంప్ట్ చేస్తుంటుంది. ఇప్పుడు రామ్ చరణ్ విషయంలోను అదే జరుగుతోంది. ఉపాసన-రామ్ చరణ్ తల్లిదండ్రులు కాబోతున్నారంటూ.. చిరంజీవి ప్రకటించడమే ఆలస్యం.. సోషల్ మీడియాలో పలు రకాల కథనాలు మొదలయ్యాయి. సరోగసి కూడా తెరపైకి వచ్చింది. అయితే అసలు చరణ్‌కు వారసుడు పుడాతాడో లేక వారసురాలు పుడుతుందో ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఎవరెన్ని చెప్పినా… మెగా ఫ్యాన్స్‌కి వారసుడు కావాలి.. చిరంజీవి లెగసి రామ్ చరణ్ నిలబెట్టాడు.. కాబట్టి చరణ్ వారసత్వం అందిపుచ్చుకునేలా.. బుల్లి హీరో పుట్టాలని గట్టిగా కోరుకుంటున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో చరణ్ వారసుడు పేరు తెరపైకొచ్చింది. సోషల్ మీడియా వర్గాల ప్రకారం.. ఇప్పటికే మెగాస్టార్ సెంటిమెంట్ కలిసొచ్చేలా పేరు ఫిక్స్ చేశాడని ప్రచారం జరుగుతోంది. మామూలుగా మెగా వారసుల పేర్లలో తేజ్‌ను ప్రత్యేకంగా పెట్టారు మెగాస్టార్. దాంతో రామ్ చరణ్ వారసుడు పేరు చివరన కూడా తేజ్ ఉండాలని భావిస్తున్నారట. పైగా మెగాస్టార్ అంజనేయస్వామి భక్తుడనే విషయం అందరికీ తెలిసిందే.. అందుకే హనుమాన్ జీ ఆశీస్సులతో అంటూ.. గుడ్ న్యూస్ షేర్ చేశారు. దాంతో తనకు మనవడు పుడితే.. ‘అంజన్ తేజ్’ అనే పేరు పెట్టాలని చిరంజీవి ఫిక్స్ అయినట్టు సోషల్ మీడియా టాక్. అసలు ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. వినటానికి మాత్రం ఈ న్యూస్ ఇంట్రెస్టింగ్గా మారింది.