నందమూరి నటసింహం నటించిన ‘వీరసింహారెడ్డి’ జనవరి 12న థియేటర్లోకి రాబోతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ అవడానికి మరో ఎనిమిది రోజులు ఉండగానే మాస్ జాతర మొదలైపోయింది. ఈసారి బాలయ్య ఫ్యాన్స్ వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఓ పండగలా చేయబోతున్నారు. అందుకే మాస్ మొగుడు సాంగ్‌ను పోస్ట్ పోన్ చేసి.. దానికి బదులుగా ట్రైలర్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ట్రైలర్ తర్వాత లేదంటే.. రిలీజ్‌కు ముందు మాస్ మొగుడు సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రెడీగా ఉండండని అంటున్నారు మేకర్స్. ప్రస్తుతం వీరసింహారెడ్డి యూనిట్ ప్రీ రిలీజ్ ఏర్పాట్లలో ఫుల్ బిజీగా ఉంది. జనవరి 6న వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో గ్రాండ్‌గా ప్లాన్ చేస్తోంది మైత్రి మూవీ మేకర్స్. ఒంగోలు ఏబీఎమ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఈ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. దాంతో ఈ వేడుకను అంతకుమించి అనేలా ప్లాన్ చేస్తున్నారు. వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ వేడుకకు వెళ్లే మార్గంలో బాలయ్య కటౌట్స్, హోర్డింగ్స్, వాల్ పోస్టర్స్‌తో హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో వీరసింహారెడ్డి ఈవెంట్ పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. ఈ సినిమాతో గోపీచంద్ మలినేని ఖచ్చితంగా మాసివ్ ట్రీట్ ఇవ్వడం ఖాయమని గట్టిగా నమ్ముతున్నారు బాలయ్య ఫ్యాన్స్. అఖండ విజయాన్ని కంటిన్యూ చేస్తూ.. బాలయ్య బాక్సాఫీస్‌ను షేక్ చేయడం పక్కా అంటున్నారు. మరి భారీ అంచనాలున్న వీరసింహారెడ్డి ఎలా ఉంటుందో చూడాలి.