నిజమే.. మహేష్ బాబు చెప్పడం వల్లే ఆ సినిమాను చూశాం.. అందుకే డబ్బులు వేస్ట్ అయ్యాయని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ఏదైనా సినిమా ప్రమోట్ చేస్తే.. కొత్త స్టార్ క్యాస్టింగ్ ఉన్నా కూడా.. కనీసం మహేష్ ఫ్యాన్స్ అయినా ఆ సినిమా కోసం థియేటర్లకు వెళ్తారు. అందుకే ఇప్పుడు మహేష్ పై సిల్లీ కామెంట్స్ వస్తున్నాయి.
Mahesh Babu: సుమంత్ ప్రభాస్ హీరోగా, దర్శకుడిగా.. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ ఛాయ్ బిస్కెట్, లహరి ఫిలింస్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’ (Mahesh Babu). ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఈ మధ్య కాలంలో ఓ చిన్న సినిమా పెద్ద ప్రమోషన్స్తో వచ్చిన సినిమాగా.. మంచి బజ్ క్రియేట్ చేసింది మేమ్ ఫేమస్ (Mahesh Babu). ఈ సినిమా అదిరిపోయిందని రిలీజ్కు ఓ రోజు ముందు మహేష్ బాబు ట్వీట్ చేయడంతో.. మేమ్ ఫేమస్ సినిమా ఒక్కసారిగా భారీగా ప్రమోట్ అయింది.
సుమంత్ ప్రభాస్ నెక్స్ట్ సినిమాను తన సొంత బ్యానర్ పై నిర్మించడం తనకు ఎంతో సంతోషం అంటూ.. చెప్పుకొచ్చాడు మహేష్ బాబు. తీరా థియేటర్లోకి ఈ సినిమా చూశాక.. పెళ్లి చూపులు, జాతి రత్నాలు కలిస్తే మేమ్ ఫేమస్ అన్నట్టుగా ఉందని.. కథ, కథనం పరంగా మేమ్ ఫేమస్ తేలిపోయిందనే టాక్ వస్తోంది. కామెడీ పరంగా మేమ్ ఫేమస్ కొద్దిగా పర్వాలేదనిపించినా.. కొత్తదనం లేదని అంటున్నారు.
మహేష్ బాబు వేసిన ట్వీట్ వల్లే ఈ సినిమాకు పోయిన వాళ్లున్నారు. అందుకే ఈ సినిమా చూసిన వాళ్లు మహేష్ పై సిల్లీగా కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ చెప్పినంత గొప్పగా సినిమా లేదని.. మహేష్ అన్న అసలు మేమ్ ఫెమస్ సినిమాని చూశావా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మహేష్ బావుంది అన్నాడు కదా.. అని టికెట్ కొని డబ్బులు వేస్ట్ చేశామంటూ సెటైర్స్ వేస్తున్నారు.