»Shocking Sharwanand Going To Be A Father After 2 Months Of Marriage
Sharwanand: షాకింగ్..పెళ్లైన 2 నెలలకే తండ్రి కాబోతున్న శర్వానంద్!
నిజమే.. శర్వానంద్ పెళ్లై రెండు నెలలే అవుతోంది. కానీ అప్పుడే తండ్రి కాబోతున్నాడనే న్యూస్ ఇప్పుడు షాకింగ్‌గా మారింది. మరి నిజంగానే ఈ యంగ్ హీరో ఫాదర్‌గా ప్రమోట్ అవుతున్నాడా? ఇండస్ట్రీ వర్గాల్లో ఎందుకు ప్రచారం జరుగుతోంది?
ప్రభాస్ (Prabhas) పెళ్లి తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని చెప్పిన యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand).. ప్రభాస్ కంటే ముందే పెళ్లి పీఠలెక్కేశాడు. జనవరి నెలలో శర్వానంద్‌కు రక్షితా రెడ్డి అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు శర్వానంద్ ఫ్రెండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన సతీసమేతంగా అటెండ్ అయ్యారు. ఇక ఎలాగు ఎంగేజ్మెంట్ అయిపోయింది కాబట్టి.. జూన్‌లో ఈ ఇద్దరు ఏడడుగులు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్ జైపూర్‌లో అంగరంగా వైభవంగా పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు హాజరయ్యారు. కానీ పెళ్లైన రెండు నెలలకే శర్వానంద్ తండ్రి కాబోతున్నాడనే న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
అయితే అసలు మ్యాటర్ వేరే ఉంది లేండీ. శర్వానంద్ తండ్రి అవుతున్నాడనేది నిజమే అయినా.. అది రియల్ లైఫ్‌లో కాదు రీల్ లైఫ్‌లో అని అంటున్నారు. ప్రస్తుతం శర్వానంద్ యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యతో ఓ సినిమా చేస్తున్నాడు. ఒక ఇంట్రెస్టింగ్ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో శర్వానంద్ ఒక బిడ్డకు తండ్రి పాత్రలో నటించబోతున్నాడట.
అంతే తప్పా రెండు నెలలకే తండ్రి కాబోతున్నాడని, ఏవేవో ఊహించుకోవద్దని అంటున్నారు. ఇకపోతే, ఈ సినిమాకు బేబీ ఆన్ బోర్డ్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందని అంటున్నారు. ఇక ప్రస్తుతం సినిమాల పరంగా రేసులో వెనకబడిపోయిన శర్వానంద్.. చివరగా చేసిన ఆడవాళ్లు మీకు జోహార్లు, ఒకే ఒక జీవితం సినిమాలు అంతగా అలరించలేకపోయాయి. దాంతో ఎలాగైనా సరే.. అప్ కమింగ్ ప్రాజెక్ట్‌తో సాలిడ్ హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. మరి నిజ జీవితంలో శర్వానంద్ తండ్రిగా ఎప్పుడు ప్రమోట్ అవుతాడో చూడాలి.