సాధారణంగా సినిమాలలో హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలలో ముద్దు పెట్టుకోవడం అన్నది సర్వసాధారణం.అయితే ఇప్పట్లో ఇది ప్రస్తుతం సర్వసాధారణమే అయినప్పటికీ ఒకప్పుడు ముద్దు పెట్టుకోవడం అంటే పెద్ద విషయమే అని చెప్పవచ్చు.రణ్వీర్ సింగ్(Ranveer Singh), ఆలియా భట్ హీరో హీరోయిన్ గా కరణ్ జోహార్ దర్శకత్వంలో రూపొంది ఇటీవల వచ్చిన చిత్రం ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’. చాలా సంవత్సరాల తర్వాత కరణ్ జోహార్ (Karan Johar) దర్శకత్వంలో రూపొందిన మూవీ విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి.రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ సినిమా(Prem Kahani movie) వంద కోట్ల వసూళ్లలో ధర్మేంద్ర, షబానా అజ్మీ ల యొక్క ముద్దు సీన్ కీలక పాత్ర పోషించింది అంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది.
ఈ వయసులో ఇద్దరు కూడా కిస్ సన్నివేశం కు ఓకే చెప్పడం విడ్డూరంగా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తే మరి కొందరు మాత్రం ఆ సన్నివేశం పట్ల ఆసక్తి చూపించారు. మొత్తానికి ఈ సినిమా లోని వృద్దుల ముద్దు సన్నివేశంతో పాటు జయా బచ్చన్(Jaya Bachchan),ధర్మేంద్ర, షబానా అజ్మీ వంటి ఆ తరం స్టార్స్ ఉడటం వల్ల సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది. ఆ బజ్ కి తగ్గట్లుగా వసూళ్లు నమోదు అవ్వలేదు. కానీ ఒక మోస్తరులో అయితే కలెక్షన్ దక్కాయి. కరోనా కు ముందు ఇలాంటి సినిమా వచ్చి ఉంటే రూ.250 కోట్ల వసూళ్లు నమోదు అయ్యి ఉండేవి అంటూ కొందరు బాలీవుడ్ (Bollywood) బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇక కరణ్ జోహార్ తాజా ఇంటర్వ్యూలో వృద్దుల ముద్దు సన్నివేశం గురించి మాట్లాడుతూ.. ధర్మేంద్ర, షబానా అజ్మీ ఇద్దరికి ఎలాంటి సమస్యలేనప్పుడు కిస్ సన్నివేశం విషయం లో ఇతరులకు ఏంటి సమస్య అంటూ నెటిజన్స్(Netizens) కామెంట్స్ చేస్తున్నారు.