»Cm Kcr To Made Another Key Decision To Revenue Department
CM KCR మరో కీలక నిర్ణయం..? ఆర్డీవో వ్యవస్థ కూడా రద్దు..?
తెలంగాణ రాష్ట్రంలో ఆర్డీవో వ్యవస్థను కూడా రద్దు చేయాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోందట. దీనికి సంబంధించి కొద్దీ రోజుల్లో ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
CM KCR To Made Another Key Decision To Revenue Department
CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతిపక్షాల సలహాలతో సంబంధం లేకుండా.. ఉద్యోగుల అభిప్రాయం పట్టించుకోకుండా ముందడుగు వేస్తున్నారు. కీలక అంశాలపై సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. అప్పట్లో వీఆర్వో (VRO) వ్యవస్థ రద్దు చేస్తే ఒకింత వ్యతిరేకత వచ్చింది. తర్వాత వారిని సర్దుబాటు చేసి.. ఏదో మమ అనిపించేశారు. తర్వాత అంతా బాగుందని అనుకుంటే వీఆర్ఏ (VRA) సిస్టమ్ కూడా తీసిపారేశారు. ఇకపై భవిష్యత్లో వీఆర్ఏలు ఉండరు.
ఇప్పుడు ఉన్న వీఆర్ఏలకు చదువును బట్టి పోస్టింగ్ ఉంటుంది. ఎంత చదువితే ఆ స్థాయిలో పోస్ట్ ఉండనుంది. దీంతో కొందరికీ మేలు జరిగింది. రెవెన్యూ డిపార్ట్ మెంట్లో కీలకం అయిన మరో వ్యవస్థ ఆర్డీవో (RDO).. ఆ పోస్ట్ కూడా లేకుండా చేస్తారట. ఇటీవల ప్రభుత్వ చర్యలను బట్టి త్వరలో ఆ పోస్టులకు కూడా ఎసరు పెట్టేలా ఉన్నారు. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఆర్డీవోల ప్రాధాన్యం తగ్గిపోయింది. సో.. వారి అవసరం లేదు కదా అని ఆలోచిస్తున్నారట. తెలంగాణలో 75 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. రాష్ట్రంలో 90 మంది ఆర్డీవోలు ఉన్నారు. ఇటీవల కొందరికీ పదోన్నతులు కూడా వచ్చాయి. మిగిలిన వారు అలానే ఉన్నారు. సో.. వారికి పెద్దగా పనేం లేదు కదా అని.. ఉన్న కొందరినీ ఇతర డిపార్ట్ మెంట్లలో సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల మండలిలో మంత్రి హరీశ్ రావు (Harish rao) చెప్పిన మాటలతో ఆర్డీవో వ్యవస్థ కూడా రద్దు కానుందని స్పష్టం అవుతుంది.
రాష్ట్రంలో ఏరియా ఆస్పత్రుల్లో సూపరింటెండెంట్లు ఉన్నారని.. వారి పర్యవేక్షణ బాధ్యతలను ఆర్డీవోలకు అప్పగిస్తామని చెప్పారు. ఆర్డీవోలను ఏరియా ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా అదనపు బాధ్యతలు అప్పగిస్తారని క్లారిటీ వచ్చింది. అదనపు బాధ్యతలు అప్పగించే బదులు పూర్తిగా ఆర్డీవో వ్యవస్థను రద్దు చేసే అవకాశం ఉందని వార్తలు గుప్పుమన్నాయి. మరీ దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఎన్నికలకు పెద్దగా సమయం లేనందున.. ఆర్డీవోలను కూడా రద్దు చేసే అవకాశం లేదని మరికొందరు అంటున్నారు. సో.. ఏం జరుగుతుందో చూడాలీ.