లేడీ ఓరియెంట్ ప్రాజెక్ట్ యశోదతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన సమంత.. ఇప్పుటు ‘శాకుంతలం’గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాళిదాసు రాసిన శాకుంతలం నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో.. సమంత టైటిల్ రోల్ ప్లే చేయగా.. ఆమె భర్త దుష్యంత పాత్రలో దేవ్ మోహన్ నటించాడు. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీని.. ఫిబ్రవరి 17న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక శాకుంతలం రిలీజ్‌కి మరో నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ క్రమంలో శాకుంతలం ట్రైలర్‌ని గ్రాండ్ ఈవెంట్‌తో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా గుణశేఖర్, సమంత కాస్త ఎమోషనల్ అయ్యారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. మామూలుగా గుణశేఖర్ నుంచి ఒక సినిమా వస్తుందంటే.. విజువల్స్ పరంగా మంచి అంచనాలే ఉంటాయి. అందుకు తగ్గట్టే ఉంది శాకుంతలం ట్రైలర్. ప్రతీ ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఓ దృశ్య కావ్యంలా ఉంది. ‘ఈ భూమి మీద అమ్మ నాన్నలు అక్కర్లేని తొలి బిడ్డ, మేనక, విశ్వమిత్రుల ప్రేమకు గుర్తు ఈ బిడ్డ.. అప్సర బిడ్డైనా అనాథలా మిగిలిందే.. అంటూ శాకుంతల పాత్రను పరిచయం చేశారు. ఆ తర్వాత యుద్ధాలు, పెద్ద పెద్ద కోటలు, ప్రకృతి అందాలు, భారీ సెట్టింగులో విజువల్ వండర్‌గా ట్రైలర్‌ను కట్ చేశారు. ముఖ్యంగా సమంత గ్లామర్‌కు తోడు.. దేవ్ మోహన్ తన క్యారెక్టర్‌కు పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు. అయితే కోటలు, కట్టడాల సెట్టింగ్ చూస్తే.. కొన్ని చోట్ల బాహుబలి మూవీని గుర్తుచేస్తుంది. బాహుబలి అంత కాకపోయినా.. ఖచ్చితంగా ఈ సినిమా మరో విజువల్ వండర్‌గా నిలిచిపోనుందని చెప్పొచ్చు. ఇక ట్రైలర్ చివర్లో ‘మాయ ప్రేమను మరిపిస్తుందేమో. అభిమానాన్ని, అవమానాన్ని ఏ మాయ మరిపించలేదు’ అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఫైనల్‌గా అల్లు అర్జున్ కుమార్తె అర్హను సింహంపై స్వారీ చేస్తున్నట్టుగా చూపించారు. ఈ సినిమాలో దుర్వాస మహర్షిగా మోహన్ బాబు నటిస్తున్నాడు. అలాగే కీలక పాత్ల్లో అనన్యా నాగళ్ళ, ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. ఒవరాల్ ట్రైలర్ చూసిన తర్వాత.. సమంత నిజంగానే దేవకన్యలా అనిపిస్తుండనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి శాకుంతలం ఎలా ఉంటుందో చూడాలి.