మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్నాడని.. ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి సినిమా పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే స్టార్టింగ్లో ఈ సినిమాలో జస్ట్ రవితేజ గెస్ట్ అప్పియరెన్స్ మాత్రమే ఇస్తున్నాడని అనుకున్నారు. కానీ వాల్తేరు వీరయ్యలో రవితేజ క్యారెక్టర్ నిడివి దాదాపు 45 నిమిషాలు ఉంటుందని గత కొద్ది రోజులుగా వినిపిస్తోంది. దాంతో రాను రాను ఇదో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అనే టాక్ ఊపందుకుంది. ఇక ఇప్పుడు మల్టీ స్టారర్ అని ఫిక్స్ అయిపోయినట్టే కనిపిస్తోంది. ఈ సినిమా కోసం తన సినిమాలకు తీసుకున్నంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడట రవితేజ.. గతంలో దాదాపు 10 కోట్లు డిమాండ్ చేశాడని వినిపించగా.. ఇప్పుడు ఏకంగా 17 కోట్లు పారితోషికం అందుకున్నట్టు తెలుస్తోంది. ముందుగా రవితేజ తన సినిమాలకు తీసుకుంటున్నట్టుగా.. వాల్తేరు వీరయ్య కోసం 18 కోట్లు పారితోషికం డిమాండ్ చేశారట. అయితే ఫైనల్గా మేకర్స్ కోసం ఒక కోటి రూపాయలు మాత్రమే తగ్గించుకున్నాడట. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇకపోతే.. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది.. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఐటెం సాంగ్లో నటించింది. రవితేజ సరసన కేథరిన్ ట్రెసా హీరోయిన్గా నటించింది. బాబీ సింహా విలన్ రోల్లో నటిస్తున్నాడు. వైజాగ్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన ఈ సినిమా.. జనవరి 13న రిలీజ్ కానుంది. జనవరి 8న విశాఖలో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.