RajaMouli : ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి అంటే ఓ బ్రాండ్. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సినిమాలకు పునాది వేసిన జక్కన్న.. ఆర్ఆర్ఆర్ మూవీతో హాలీవుడ్ రేంజ్‌కు వెళ్లిపోయారు. అంతేకాదు ఆస్కార్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకోని.. చరిత్రకు అడుగు దూరంలో ఉన్నాడు.
ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి అంటే ఓ బ్రాండ్. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సినిమాలకు పునాది వేసిన జక్కన్న.. ఆర్ఆర్ఆర్ మూవీతో హాలీవుడ్ రేంజ్‌కు వెళ్లిపోయారు. అంతేకాదు ఆస్కార్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకోని.. చరిత్రకు అడుగు దూరంలో ఉన్నాడు. ట్రిపుల్ ఆర్ మూవీకి ఎన్నో అంతర్జాతయ అవార్డ్స్ అందుకున్న రాజమౌళి.. మార్చి 12 ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో హాలీవుడ్ రేంజ్ సినిమా చేయబోతున్నాడు. అలాంటి జక్కన్న ఓ స్క్రిప్ట్ చదివి కంటతడి పెట్టాడట. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్.. ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) పై సినిమా చేయబోతున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ కథ రెడీ అయిపోయిందని.. త్వరలోనే సినిమాతో పాటు వెబ్ సిరీస్ కూడా ఉంటుందని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో.. ఈ ప్రాజెక్ట్ పై రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. తనకు ఆర్ఎస్ఎస్ చరిత్ర గురించి పెద్దగా అవగాహన లేదు.. కానీ, మా నాన్న గారు రాసిన స్క్రిప్ట్ చదివాను.. అది చాలా ఎమోషనల్‌గా, అద్భుతంగా ఉంది.. ఆ స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు చాలాసార్లు ఏడ్చాను.. స్క్రిప్ట్ లోని ఎమోషనల్ డ్రామా కంటతడి పెట్టేలా ఉందని అన్నారు. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తానో.. లేదో.. తెలియదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి రాజమౌళినే కంటతడి పెట్టించిన ఆర్ఎస్ఎస్ స్క్రిప్ట్.. తెరపైకి ఎప్పుడొస్తుందో చూడాలి.