ఈ సంక్రాంతికి చిరు, బాలయ్య.. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు ఓ రేంజ్లో హంగామా చేయబోతున్నాయి. ఇద్దరి దెబ్బకు బాక్సాఫీస్ బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా సంక్రాంతికి సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది. అసలు బాలయ్యతో పవన్ టాక్ షో అంటేనే ఓ సెన్సేషన్.. ఈ ఇద్దరు కలవడమే ఓ హాట్ టాపిక్.. అలాంటిది బాలయ్యతో కలిసి పవన్ అన్‌స్టాపబుల్ టాక్ షో చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆహా ఓటిటిలో వస్తున్న బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో.. ఇప్పటికే ప్రభాస్ ఫస్ట్ ఎపిసోడ్ రికార్డులు బద్దలు చేసింది. ఇక జనవరి 6న బాహుబలి సెకండ్ పార్ట్ ఎపిసోడ్ రానుంది. అయితే ఆ తర్వాత కూడా అదిరిపోయే ఎపిసోడ్ పడబోతోంది. ప్రభాస్ తర్వాత పవన్ కళ్యాణ్ ఈ షోకి గెస్ట్‌గా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవలె షూటింగ్ కూడా అయింది. ఈ షూటింగ్‌నే సినిమా ఓపెనింగ్ రేంజ్లో రచ్చ రచ్చ చేశారు అభిమానులు. ఇక ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయితే ఇంకెలా ఉంటుందోననే చర్చ జరుగుతోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. పవన్ అన్‌స్టాబుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ ఇదే అంటున్నారు. సంక్రాంతి స్పెషల్ కానుకగా జనవరి 13న, పవన్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. ఒకవేళ సంక్రాంతికి పవన్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయితే మాత్రం.. మెగాభిమానులకు ఇంతకంటే పెద్ద పండగ మరోటి లేదని చెప్పొచ్చు. ఎందుకంటే.. మెగాస్టార్ వాల్తేరు వీరయ్య కూడా జనవరి 13నే థియేటర్లోకి రాబోతోంది.