విజయ్ దేవరకొండకు సరైన హిట్ లేక చాలాకాలమే అయింది. భారీ ఆశలు పెట్టుకున్న లైగర్ అంతంత మాత్రమే అనిపించగా.. జనగణమన కూడా వాయిదా పడింది. దీంతో అటు పూరీ, ఇటు దేవరకొండ బాగా డిస్టర్బ్ అయ్యారు. అయితే విజయ్ సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఇప్పుడు విజయ్ దేవరకొండ సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చాడు దేవరకొండ. శివ నిర్వాణతో చేస్తున్న ఖుషి సినిమా ఇంకా లేటయ్యే ఛాన్స్ ఉండటంతో మరో సినిమాను ప్రకటించేశాడు. […]
ప్రస్తుతం చిరు, బాలయ్య ఫ్యాన్స్ హంగామా ఎలా ఉందో చూస్తునే ఉన్నాం. థియేటర్లో మాస్ జాతరను తలపించేలా గోల గోల చేస్తున్నారు అభిమానులు. కార్ల ర్యాలీలు, బైక్ ర్యాలీలతో సినిమాకు వెళ్తు.. తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్‌లోను మెగా, నందమూరి అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. అందుకు తగ్గట్టే సినిమాలకు పాజిటివ్ టాక్ రావడంతో.. ఫ్యాన్స్‌కు నిజంగానే పూనకాలు వస్తున్నాయి. అది ...
థియేటర్లో వీరసింహారెడ్డి ఊచకోతకు.. రికార్డులు బద్దలవుతున్నాయి. అఖండ బ్లాక్ బస్టర్.. అన్ స్టాపబుల్ టాక్ షో.. బాలయ్య క్రేజ్‌ను పీక్స్‌కు తీసుకెళ్లాయి. ఇలాంటి సమయంలో క్రాక్ బ్లాక్ బస్టర్‌తో జోష్ మీదున్న గోపీచంద్ మలినేని.. బాలయ్యతో వీరసింహారెడ్డి తెరకెక్కించాడు. దానికి తోడు మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించడం.. సినిమా పై భారీ హైప్ తీసుకొచ్చింది. అందుకు తగ్గట్టే బాలయ...
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ హంగామా స్టార్ట్ అయిపోయింది. మెగాభిమాని బాబీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ పోలీస్ కమిషనర్ ఆఫీసర్‌గా నటించాడు. అయితే వాల్తేరు వీరయ్యలో రవితేజ స్థానంలో ముందుగా మెగా హీరో తీసుకోవాలని అనుకున్నారట. కానీ జస్ట్ మిస్ అయిందని అంటున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యంగా సాగుత...
ఎన్నడూ లేని విధంగా ఈ సారి మన ఇండియన్ సినిమాలను తెగ ఊరిస్తోంది ఆస్కార్ అవార్డ్. గత కొద్ది రోజులుగా ఆస్కార్ రేసులో ఆర్ఆర్ఆర్ పక్కా అంటూ.. హాలీవుడ్ ప్రిడిక్షన్స్ చెబుతూ వస్తున్నాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ లభిస్తుందా.. లేదా.. అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒరిజినల్ సాంగ్ నాటు నాటు, ఉత్తమ నటులు, ఉత్తమ దర్శకుడు విభాగాల్లో ఆస్కార్ కోసం పోటీ పడుతుంది ఆర్ఆ...
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా అనగానే.. ఎగిరి గంతేశారు మెగా ఫ్యాన్స్. అందుకు తగ్గట్టే శంకర్ స్పీడ్ చూసి.. అనుకున్న దానికంటే ముందే ఈ సినిమా థియేటర్లోకి వస్తుందని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా.. ఆగిపోయిన ఇండియన్2ని తిరిగి లైన్లోకి తీసుకున్నాడు శంకర్. విక్రమ్ సక్సెస్ జోష్‌లో ఉన్న కమల్ హాసన్ మొండి పట్టుకు.. శంకర్ రెండు సినిమాలను ఒకేసారి షూట్ చేయాల్సి వచ్చ...
బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు కదా.. రోజు రోజుకి పెరుగుతునే ఉంది. ఎందుకంటే.. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఇండియాలో ఏ హీరోకి లేనన్ని భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె.. ఈ సినిమాలన్నీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి. అలాగే మారుతి సినిమా కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక సందీప్ రెడ్డి వంగ ...
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా.. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సొంతం చేసుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ నాటు నాటుకి గానూ ఈ అవార్డ్ వచ్చింది. దాంతో సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు.. సోషల్ మీడియా వేదికగా తమ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ రాజమౌళితో సినిమా ...
ముందుగా జనవరి 11న వారసుడు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించాడు దిల్ రాజు. కానీ లాస్ట్ మినిట్‌లో చిరు, బాలయ్య కోసం త్యాగం చేస్తున్నట్టు.. అందరూ బాగుండాలని.. తెలుగు హీరోలే ఫస్ట్ థియేటర్లోకి రావాలని.. జనవరి 14కి వారసుడు మూవీని పోస్ట్ పోన్ చేశాడు. కానీ తమిళ్ వెర్షన్ మాత్రం అనుకున్న సమయానికే రిలీజ్ అయిపోయింది. ఇక అక్కడ ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. విజయ్ ఫ్యాన్స్‌తో పాట...
హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కేమరూన్ ఇటీవలె అవతార్ 2తో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించాడు. దాదాపు రెండు దశాబ్దాదాలకు పైగా అవతార్2కే సమయాన్ని కేటాయించాడు. అందుకు తగ్గట్టే భారీ వసూళ్లను రాబట్టింది. అయితే డివైడ్ టాక్ రావడం వల్ల.. బాక్సాఫీస్ దగ్గర అవతార్2 సునామీ మిస్ అయింది. అయినా అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ అవతార్3, 4, 5కు భారీ క్రేజ్ ఉంది. అయితే అవతార్ 2 హవా తగ్గకముందే.. మరోసారి తన కల్ట్ క్లాసిక్ ...
ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం ఎక్కడ చూసిన దీని గురించే చర్చ జరుగుతోంది. అసలు దర్శక ధీరుడు ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి.. వార్తల్లో నిలుస్తునే ఉంది. రిలీజ్ అయి ఏడాది దాటినా కూడా.. ఆర్ఆర్ఆర్ సంచలనంగా నిలుస్తోంది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఆర్ఆర్ఆర్కు.. అవార్డుల పంట పండుతోంది. ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ కొల్లగొట్టింది. తాజాగా ప్రతిష్ఠాత్మక ‘గోల్డెన్...
ఇప్పటి వరకు బాలయ్య సినిమాల రికార్డులన్నింటిని.. బ్రేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు వీరసింహారెడ్డి. అఖండ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బాలయ్య.. ఈసారి మరిన్ని రికార్డులు తిరగరాయడం పక్కా అంటున్నారు నందమూరి అభిమానులు. అందుకు తగ్గట్టే ఓవర్సీస్లో దుమ్ముదులుపుతోంది వీరసింహారెడ్డి. ఈ సినిమా తెలుగులో థియేటర్లో రావడానికి ముందే.. ఓవర్సీస్లో ప్రీమియర్స్ స్టార్ట్ కానున్నాయి. అయితే ఈ సినిమాకు యుఎస్‌లో భ...
ఎస్ఎస్ రాజమౌళి విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్. ఈ మూవీలో గల ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది. ఆ మూవీ టీమ్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అవార్డు రావడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు గెలుచుకొని భారతీయులను గర్వపడేలా చేశారని ట్వీట్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, గేయ రచయిత చంద్రబోస్, ...