ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి వరుసగా అవార్డులు అందుకుంటూ చరిత్రను తిరగరాస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుని తెలుగు పాట ఖ్యాతిని పెంచారు. ఇప్పుడు ఆస్కార్ నామినేషన్ల లిస్టులో నాటు నాటు పాట చేరడంతో మరో ఘనత సాధించారు. తాజాగా నేడు ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.
Much honoured by the civilian award from the Govt of India 🙏 Respect for my parents and all of my mentors from Kavitapu Seethanna garu to Kuppala Bulliswamy Naidu garu on this occasion 🙏
తనకు పద్మశ్రీ లభించడంపై కీరవాణి ఆనందం వ్యక్తం చేశాడు. అవార్డు గురించి ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ‘భారత ప్రభుత్వం నుంచి వచ్చిన పౌర పురస్కారాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఈ సందర్భంగా నా తల్లిదండ్రులతో పాటు కవితపు సీతన్న గారి నుంచి కుప్పాల బుల్లిస్వామి నాయుడు వరకు నా గురువులందరికీ గౌరవ వందనాలు’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం కీరవాణి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు సంగీతం అందించిన కీరవాణికి అంతర్జాతీయ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దేశంలో అత్యున్నత పురస్కారం కూడా అందుకోవడం పట్ల ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.