హీరో రాజశేఖర్ కూతురు శివాని వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. రాజశేఖర్, జీవిత కూతురిగా ఈమె తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చింది. పెద్ద హీరోలు, హిట్ సినిమాల్లో నటించకపోయినా హీరో కూతురు అనే ట్యాగ్ లైన్ తో అవకాశాలను అందుకుంటూ వస్తోంది.
శివానీ రాజశేఖర్ ఫస్ట్ మూవీ ‘అద్భుతం’. ఈ సినిమా విషయానికొస్తే టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాకు విమర్శకులు ప్రశంసలు దక్కగా మొదటి సినిమాతోనే మంచి నటిగా ఆమె ప్రూవ్ చేసుకుంది. అంతేకాకుండా తల్లి, తండ్రికి తగ్గ తనయగా శివాని నిరూపించుకుంది.
అద్భుతం తర్వాత డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు సినిమాలో నటించి మెప్పించింది. ఆ తర్వాత తన తండ్రితో కలిసి శేఖర్ అనే టైటిల్‌తో రియల్ లైఫ్ కూతురు పాత్రలో నటించింది. ప్రస్తుతం శివాని రెండు తమిళ సినిమాల్లో చేస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శివాని, శివాత్మిక ఇద్దరూ తమ అప్డేట్స్ని నెటిజన్లతో షేర్ చేసుకుంటూ వస్తుంటారు. తాజాగా శివానీ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
శివానీ తన తండ్రి బాటలో డాక్టర్ చదువుతూ మరోవైపు యాక్టింగ్ వైపు ఫోకస్ పెడుతోంది. సోదరి శివాత్మిక, శివానీ ఇద్దరూ పోటీ పడి మరీ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతుంటారు. తాాాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.