‘కలర్ ఫోటో’ హీరో సుహాస్ హీరోగా ”రైటర్ పద్మభూషణ్” సినిమా రూపొందింది. ఛాయ్ బిస్కట్ ఫిలిమ్స్ బ్యానర్లో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ నుంచి అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. సుహాస్ కు జోడిగా ఈ సినిమాలో టీనా శిల్పరాజ్ కనిపిస్తోంది. ఈసినిమాతోనే టీనా శిల్పరాజ్ కథనాయికగా తెలుగు తెరకు పరిచయం అవుతోంది.
తాజాగా ‘రైటర్ పద్మభూషణ్’ సినిమా నుంచి లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘అయ్యబాబోయ్ గందరగోళం .. మా వాడేమో తింగరమేళం’ అంటూ ఈ పాట సాగుతుంది. కల్యాణ్ నాయక్ ఈ పాటను కంపోజ్ చేశారు. ఈ పాటను కోటి మామిడాల రచించారు. ఈ సినిమాలో కీలక పాత్రల్లో ఆషిశ్ విద్యార్థి, రోహిణిలు నటించారు. హీరో సుహాస్ స్ట్రగులింగ్ రచయిత పాత్రలో ‘రైటర్ పద్మభూషణ్’లో కనిపించనున్నారు. ఇది పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.