అక్కినేని అఖిల్ నటిస్తున్న ఏజెంట్ మూవీ.. చాలా రోజులుగా పోస్ట్‌పోన్ అవుతూ వస్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాను.. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. అందుకే లేట్ అయినా పర్లేదు కానీ.. నో కాంప్రమైజ్ అంటున్నాడు. వాస్తవానికి ఈ సినిమాను లాస్ట్ ఇయర్లోనే రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించారు. కానీ షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో వాయిదాల మీద వాయిదాలు పడుతునే ఉంది. దాంతో అసలు ఏజెంట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంలో క్లారిటీ రావడం లేదు.
అయితే సమ్మర్లో ఈ సినిమా రావడం ఖాయమంటున్నారు. ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారట. అయితే ఆ రోజు మెగాస్టార్ నటిస్తున్న భోళా శంకర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. కానీ ఏజెంట్, భోళా శంకర్.. రెండు సినిమాలను.. నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. దాంతో అఖిల్‌ను ముందుగా ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నాట. భోళా శంకర్‌ను మే నెలలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారట. అతి త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. ఇకపోతే.. ఏజెంట్లో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాతోనే అమ్మడు హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. ఏజెంట్లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కూడా కీరోల్ ప్లే చేస్తున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ తర్వాత వస్తున్న ఈ యాక్షన్ మూవీపై అఖిల్ భారీగా ఆశలు పెట్టుకున్నాడు. మరి ఏజెంట్ ఏం చేస్తాడో చూడాలి.