‘Akhil’ : ఎన్టీఆర్, చరణ్‌తో గట్టిగా ప్లాన్ చేస్తున్న ‘అఖిల్’!
ఇక ఇప్పుడు అక్కినేని హీరో అఖిల్ కూడా.. చరణ్, తారక్ ఇద్దరినీ రంగంలోకి దింపేందుకు రెడీ అవుతున్నాడట. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో.. అఖిల్ నటిస్తున్న ఏజెంట్ మూవీ, ఏప్రిల్ 28న రిలీజ్‌కు రెడీ అవుతోంది. అఖిల్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే. ఇప్పటి వరకు అఖిల్‌కు సరైన్ మాస్ బొమ్మ పడలేదు. ఈ సినిమాతో మాస్ ఫాలోయింగ్‌తో పాటు.. ఏకంగా పాన్ ఇండియా స్టార్ డమ్ కొట్టేయాలని చూస్తున్నాడు.
బాహుబలితో ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్.. ట్రిపుల్ ఆర్ మూవీతో చరణ్, ఎన్టీఆర్‌లను గ్లోబల్ స్టార్స్ చేశాడు దర్శక ధీరుడు రాజమౌళి. నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి హాలీవుడ్ క్రేజ్ తీసుకురాబోతున్నాడు. ఇక ఆ తర్వాత రాజమౌళి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో.. ఇప్పుడే చెప్పలేం. ఇప్పడైతే.. ఇండియా వైడ్‌గా ప్రభాస్, ఆ తర్వాత చరణ్, తారక్, అల్లు అర్జున్ భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ప్రజెంట్ చరణ్, తారక్ హవా నడుస్తోంది. రీసెంట్గా నాటు నాటు సాంగ్ ఆస్కార్ అందుకోవడంతో.. ఇద్దరి క్రేజ్ పీక్స్‌కు వెళ్లిపోయింది. అలాంటి స్టార్స్‌తో ఏదైనా సినిమాకు ప్రమోషన్స్ చేయిస్తే.. భారీ హైప్ రావడం పక్కా. మార్చి 22న రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘దాస్ కా ధమ్కీ’ మూవీ కోసం.. ఎన్టీఆర్‌ను గెస్ట్‌గా తీసుకొచ్చి మంచి బజ్ క్రియేట్ చేశాడు విశ్వక్ సేన్. ఇక ఇప్పుడు అక్కినేని హీరో అఖిల్ కూడా.. చరణ్, తారక్ ఇద్దరినీ రంగంలోకి దింపేందుకు రెడీ అవుతున్నాడట. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో.. అఖిల్ నటిస్తున్న ఏజెంట్ మూవీ, ఏప్రిల్ 28న రిలీజ్‌కు రెడీ అవుతోంది. అఖిల్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే. ఇప్పటి వరకు అఖిల్‌కు సరైన్ మాస్ బొమ్మ పడలేదు. ఈ సినిమాతో మాస్ ఫాలోయింగ్‌తో పాటు.. ఏకంగా పాన్ ఇండియా స్టార్ డమ్ కొట్టేయాలని చూస్తున్నాడు. అందుకే.. ఈ సినిమా ప్రమోషన్లను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నాడట. అందులో భాగంగా.. గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్న రామ్ చరణ్, ఎన్టీయార్‌లను.. ఏజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్లుగా తీసుకురాబోతున్నారట. చరణ్, తారక్ ఇద్దరితోను అఖిల్‌కు మంచి బాండింగ్ ఉంది. కాబట్టి.. ఏజెంట్ కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కాకపోయినా.. ఏదో ఓ రకంగా ప్రమోట్ చేయడం మాత్రం గ్యారంటీ. మరి.. ప్రమోషన్స్ కోసం ఏజెంట్ ఎప్పుడు రంగంలోకి దిగుతాడో చూడాలి.