ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత దర్శకుడు కొరటాల శివతో ఎన్టీఆర్ తన తదుపరి సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే ఇప్పటి వరకూ ఆ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏదీ రాలేదు. ఆర్ఆర్ఆర్ విడుదలైన తర్వాత రామ్ చరణ్ మరో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఆ సినిమాకు సంబంధించి వరుస అప్ డేట్స్ విడుదల చేస్తున్నారు. అయితే తారక్ మాత్రం తన 30వ సినిమా గురించి ఇంకా ఎటువంటి అప్ డేట్ ఇవ్వలేదు. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుందని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది.
సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి వరుస కథనాలు వైరల్ అవుతున్నాయి. సముద్రపు మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం తెలిసింది. ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ ను హైదరాబాద్ లో వేస్తున్నట్లు తెలుస్తోంది. తారక్ కోసం భారీ సముద్రం సెట్ ను ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ఆధ్వర్యంలో వేస్తున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాలకు పనిచేసిన సిరిల్ ఆధ్వర్యంలో ఈ భారీ సెట్ ను వేస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి. రెండు రోజుల కిందట తన బర్త్ డే వేడుకలను సాబు ఈ సెట్ లోనే జరుపుకున్నారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.