ఇప్పటి వరకూ బాలనటిగా నటించి మెప్పించిన అనిఖ సురేంద్రన్ ఇప్పుడు హీరోయిన్ గా అడుగుపెడుతోంది. తెలుగులో ఆమె ‘బుట్టబొమ్మ’ సినిమాతో కథానాయికగా పరిచయం అవుతోంది. ఇది పల్లెటూరిలో నడిచే స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కుతోంది. సితార నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. శౌరీ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇంత వరకూ ఈ సినిమాకు సంబంధించిన పలు అప్ డేట్స్ వచ్చాయి. తాజాగా ఈ సినిమీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ లాంచ్ చేసింది.
టాలీవుడ్ నటుడు విష్వక్సేన్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. గ్రామీణ స్థాయిలో ఉండే ప్రేమ, పరువు, భయం, రాజకీయాల చుట్టూ ఈ కథ సాగుతుందని ట్రైలర్ ను చూస్తే తెలుస్తుంది. ఈ మూవీ ట్రైలర్ అద్భుతంగా ఆకట్టుకుంటోంది. సూర్య వశిష్ట ఇందులో హీరోగా నటిస్తున్నారు. ప్రతినాయకుడిగా అర్జున్ దాస్ కనిపిస్తున్నారు. గోపీ సుందర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. ఫిబ్రవరి 4వ తేదిన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.