విక్టరీ వెంకటేష్ హీరోగా 75వ చిత్రం తెరకెక్కనుంది. ఇటీవలె హిట్ 2 సినిమాతో విజయాన్ని అందుకున్న డైరెక్టర్ శైలేషన్ కొలను వెంకీ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘సైంధవ్’ అనే టైటిల్ ను చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో వెంకటేష్ పవర్ ఫుల్ లుక్ లో కనిపించనున్నారు.
చేతిలో తుపాకీ పట్టుకుని టెర్రిఫిక్ గా కనిపించిన గ్లింప్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తిక అప్డేట్ ను చిత్రయూనిట్ పంచుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ ఫేమస్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించనున్నారు. సైంధవ్ సినిమాలో కీలకపాత్రలో ఆయన కనిపించనున్నారు. తాజాగా నేడు సైంధవ్ సినిమాను పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ఈ వేడకకు నాగ చైతన్య, రానా దగ్గుబాటి, నిర్మాత సురేష్ బాబు, డైరెక్టర్ శైలేష్, నవాజుద్దీన్ హాజరయ్యారు.