జనవరి 25న షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన పఠాన్ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఆనంద్ సిద్దార్త్ దర్శకత్వం వహించాడు. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నెక్స్ట్ హృతిక్ రోషన్‌తో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌తోనే మైత్రీ వాళ్లు బాలీవుడ్లో అడుగుపెడుతున్నారు. అయితే ఎందుకైనా మంచిది.. పఠాన్ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత.. సిద్ధార్థ్‌తో కమిట్ అవుదామని మైత్రి నిర్మాతలు వెయిట్ చేశారట. ఇక పఠాన్‌కు హిట్ టాక్ రావడంతో.. ప్రభాస్ సినిమా కోసం సిద్ధార్థ్ ఆనంద్ 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు టాక్. దాంతో మైత్రీ మేకర్స్ షాక్ తిన్నంత పనైందట.
అయితే ప్రభాస్ అంటే పాన్ ఇండియా హీరో.. అందుకే 150 కోట్ల వరకు పారితోషికం ఇచ్చేందుకు క్యూ కడుతున్నారు మేకర్స్. కానీ ఇప్పుడు ప్రభాస్ రేంజ్లో సిద్ధార్థ్ ఆనంద్ కూడా అంతే మొత్తం డిమాండ్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ సినిమాలో హృతిక్ రోషన్ కూడా నటించబోతున్నట్టు తెలుస్తోంది. పైగా పఠాన్‌తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కాబట్టి మైత్రీ మేకర్స్ సిద్ధార్త్ ఆనంద్‌కు అంత మొత్తంలో ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగైదు భారీ సినిమాలు ఉన్నాయి. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, మారుతి సినమాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ ఇయర్ ఎండింగ్లో సందీప్ రెడ్డి వంగ ‘స్పిరిట్’ స్టార్ట్ కానుంది. ఈ సినిమాల తర్వాతే సిద్దార్ద్-ప్రభాస్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ లోపు సిద్దార్థ్ ‘ఫైటర్’ కంప్లీట్ చేయనున్నాడు.