బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ బ్రహ్మాస్త్ర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ మధ్యనే రణ్ బీర్ భార్య అలియా భట్ పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం రణ్ బీర్ పాపకి, అలియా భట్ కి టైం కేటాయిస్తూ ఎక్కువగా సమయం ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇప్పుడు రణ్ బీర్ చేతిలో రెండు సినిమాలున్నాయి. ఆ సినిమాలు రెండు షూటింగ్ దశలో ఉన్నాయి. రణ్ బీర్ కు తన ఫ్యాన్స్ అంటే చాలా ఇష్టం. రణ్ బీర్ లాంటి స్టార్ హీరోలు కనిపిస్తే జనాలు సెల్ఫీలకోసం ఎగబడక ఉండలేరు. తాజాగా రణ్ బీర్ ఓ ఈవెంట్ కి హాజరై వెళ్తుండగా ఫ్యాన్స్ చుట్టుముట్టారు. రణ్ బీర్ తో కలిసి ఫోటోలు, సెల్ఫీలు తీసుకున్నారు.
ఆ టైంలో ఓ అభిమాని రణ్ బీర్ తో కలిసి సెల్ఫీ తీసుకున్నాడు. ఫోటో సరిగా రాలేదని మరోసారి సెల్ఫీ కోసం ప్రయత్నించాడు. దీంతో కోపం వచ్చిన రణ్ బీర్ ఆ అభిమాని చేతిలోని ఫోన్ ను తీసుకుని వెనక్కి విసిరేశాడు. దీంతో అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. ప్రస్తుతం రణ్ బీర్ తన ఫ్యాన్ ఫోన్ ను విసిరేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ లో కూడా బాలయ్య ఇలా చేసిన ఘటన అప్పట్లో నెట్టింట వైరల్ అయ్యింది. ప్రస్తుతం రణ్ బీర్ వీడియో చూసినవారు రకరకాలుగా స్పందిస్తున్నారు. బాలయ్యగా మారిన రణ్ బీర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.