విలక్షణ నటుడు కమల్ హాసన్ అరుదైన అవార్డు అందుకోనున్నాడు. ఇప్పటి వరకు చాలా అవార్డులు అందుకున్న ఆయన, మరో అవార్డు అందుకోనున్నాడు. ఆయన దాదాపు ఆరు దశాబ్ధాలుగా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆయన తన టాలెంట్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు.
ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ఈ మూవీ తర్వాత ఆయన బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. వార్ సినిమా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ కాగా, దానికి మించి ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ ఏడాది చివరి కల్లా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట.
చాలా మూవీలకు హీరీలు మారడం, డైరెక్టర్లు మారడం, హీరోయిన్లు మారడం సర్వ సాధారణం. చాలాసార్లు ముందు ఒక హీరోతో అనుకున్న సినిమా, తర్వాత మరో హీరోతో చేయాల్సి వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో మహేష్ చేయాల్సిన ఓ సినిమా ఇప్పుడు బాలీవుడ్ హీరో హృతిక్ ఖాతాలోకి పోయింది.
తన సొంత బ్యానర్లో కృష్ణ(Super star Krishna) ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నారు. అప్పట్లో 'మోసగాళ్లకు మోసగాడు' సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది.
సినీ అభిమానులను అలరించడానికి ఈ వారం కూడా మరికొన్ని చిత్రాలు వచ్చేశాయి. ఈ క్రమంలో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు ఏంటీ? వాటిలో ఏ చిత్రాలు చూడాలి? ఆ సినిమాలకు దర్శకులు ఎవరు? అసలు ఈ సినిమాలకు వెళ్దామా వద్దా అనేది ఈ వివరాలను చూసి నిర్ణయించుకోండి.
తెలుగు ప్రేక్షకులకు వీకే నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు హీరోగా చేసి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. ఈ మధ్య నటనతో కాకుండా వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.
ఇటివల విరూపాక్షతో మరో హిట్‌ను యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్(samyuktha menon) తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ అమ్మడు మంచి జోరు మీదుంది. ఈ క్రమంలో తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో పలు ఫోటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసింది. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఆ ఫోటోలకు రెండు లక్షలకు పైగా లైకులు వచ్చాయి. అంతేకాదు అవి చూసిన నెటిజన్లు వావ్, లవ్ యూ అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. మరి ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో మీరు కూడా ఓ లుక్క...
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుతో ‘కొబ్బరి మట్ట’ సినిమా తీసిన డైరెక్టర్ రూపక్ రోనాల్డ్ సన్ ఇప్పుడు 'పరేషాన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
‘దేవర’ ఫస్ట్ లుక్(Devara First look)కు వచ్చిన అద్భుతమైన స్పందనకు ఎన్టీఆర్(NTR) కృతజ్ఞతలు తెలిపారు. తన పుట్టినరోజును ఇంత ప్రత్యేకంగా మార్చినందుకు తన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, నటీనటులకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలిపారు.
ఇంటిపై తీసుకున్న లోన్ కట్టకపోవడంతో జప్తు చేస్తున్నామని బ్యాంక్ అధికారులు నోటీసులు ఇచ్చారని ప్రముఖ దర్శకుడు తేజ తెలిపారు. లోన్ మొత్తం కట్టినప్పటికీ.. నోటీసు ఇప్పటికీ తీయలేదని గుర్తుచేశారు.
బుట్టబొమ్మ బ్యూటీ పూజా హెగ్దే(Pooja Hegde) తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో రెడ్ కలర్ డ్రైస్ ధరించిన ఫోటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసింది. అంతే కేవలం రెండు గంటల్లోనే దాదాపు 5 లక్షల మంది లైక్ చేశారు. ఈ చిత్రాలు చూసిన పలువురు సూపర్, లవ్ యూ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆ పిక్స్ ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి మరి.
దిగ్గజ నటుడు, మాజీ ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 100వ జయంతి వేడుకలను నిన్న(మే 20న) హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని కైతలాపూర్ మైదానంలో జరిపింది. ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులతోపాటు స్టార్ హీరోలు కూడా రావడంతో అభిమానులు మరపురాని అనుభూతిని పొందారు. అయితే ఈ వేడుకకు సంబంధించిన పలు ఫొటోలను ఇక్కడ చుద్దాం.