ఆహాలో సింగింగ్ రియాలిటీ షో యొక్క ప్రస్తుత సీజన్ 2 దాని గ్రాండ్ ఫినాలే జూన్ 3, 4 తేదీల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ షోకు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ వచ్చారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రొమో వీడియోలో స్టైలిష్ స్టార్ తన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ గురించి కీలక విషయం చెప్పారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. కాగా, ఆయన పర్సనల్ లైఫ్ గురించి కూడా అందరికీ తెలిసిందే. ఆయన స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం జరిగి దాదాపు పదేళ్లు అవుతుంది. ఇద్దరు సంతానం కూడా ఉన్నారు.
అయితే ఆయనకు స్నేహ కంటే ముందు మరో గర్ల్ ఫ్రెండ్ ఉండేదట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పడం విశేషం. ఈ మధ్య ఆహాలో ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ ఫైనల్స్ కు గెస్ట్ గా వెళ్లిన బన్నీ..తన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పుకొచ్చాడు. కంటెస్టెంట్స్ లో ఒకరైన శృతి..అల వైకుంఠపురంలోని ఓ మై గాడ్ డాడీ అనే పాటను పాడి అల్లు అర్జున్ ఇంప్రెస్ చేసింది.
ఇక ఆమె గురించి బన్నీ చెప్తూ ‘‘నీ పేరు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా మొదటి గర్ల్ ఫ్రెండ్ పేరు కూడా శృతినే. అయితే ఇప్పుడు చెప్పకూడదు.. నేను అసలే ఇంటికి వెళ్ళాలి. మా ఆవిడ ఈ ప్రోగ్రాం చూస్తూ ఉంటుంది” అంటూ నవ్వేశాడు. ఇక ఈ మాటకు గీత మాధురి మాట్లాడుతూ.. ” అది కాదు సర్ .. గర్ల్ ఫ్రెండ్ అని చివర్లో 1st క్లాస్, సెకండ్ క్లాస్ అనరు కదా ” అని అడుగగా.. లేదమ్మా. అలా అయితే ఇంతలా సిగ్గు ఎందుకు పడతాను అంటూ నవ్వేశాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.