Balayya 108 title: నటసింహాం నందమూరి బాలకృష్ణ (Balakrishna) 108వ సినిమా పేరు ఖరారు అయ్యింది. ఈ మూవీని సాహు గారపాటి- హరీశ్ పెద్ద నిర్మిస్తోండగా.. అనిల్ రావిపూడి (anil ravipudi) తెరకెక్కిస్తున్నారు. బాలయ్య సరసన తమన్నా (tamannah) నటిస్తుండగా.. కూతురిగా శ్రీలీల (sreeleela) యాక్ట్ చేస్తున్నారు.
మూవీ ముహుర్తపు సన్నివేశాన్ని గతేడాది డిసెంబర్ 8వ తేదీన తీశారు. మూవీలో కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయ్యింది. సినిమా టైటిల్ ఇప్పటివరకు ఖరారు కాలేదు. మూవీ కోసం ‘భగవత్ కేసరీ’ (Bhagavath Kesari) అనే టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఐ డోంట్ కేర్ అని ట్యాగ్ లైన్ ఉంటుంది. ఈ టైటిల్ రిజిస్టర్ చేయడంతో ఫైనల్ అని తెలుస్తోంది. కానీ బాలయ్య (balayya) బర్త్ డే అయిన జూన్ 10వ తేదీన టైటిల్ ప్రకటిస్తారట. టైటిల్‌కు తగినట్టు బాలయ్య (balayya) ఓ రేంజ్లో విజృంభిస్తారట.
చదవండి: Salaar Movie: ‘సలార్’ ఆడియో కోసం గట్టి పోటీ!
బాలయ్య మార్క్ యాక్షన్‌తో మూవీ ఉంటుంది. అలాగే అనిల్ రావిపూడి మార్క్ కామెడీ సన్నివేశాలు కూడా ఉంటాయి. సినిమాను దసరాకు రిలీజ్ చేస్తారట. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా బాలకృష్ణ (Balakrishna) మూవీస్ చేసుకుంటూ వెళుతున్నారు. సింహా నుంచి మంచి హిట్స్ వచ్చాయి. సీమ ఫ్యాక్షన్, మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారు. బాలయ్య సినిమాలకు మాస్ ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది.