Apoorva Lakhia Reveals About Ram Charan Differences
Apoorva Lakhia: అప్పట్లో ‘జంజీర్’ అనే హిందీ మూవీని రామ్ చరణ్ తీశారు. ఆశించిన ఫలితం ఇవ్వలేదు. సినిమాలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్గా నటించగా.. అపూర్వ లఖియా (Apoorva Lakhia) తెరకెక్కించారు. తుఫాన్ పేరుతో తెలుగులో మూవీ రిలీజ్ అయ్యింది. ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ (Ram charan)- అపూర్వ లఖియా టచ్‌లో లేకుండా పోయారట.. దీంతో వీరి మధ్య విభేదాలు వచ్చాయని ఒక్కటే చర్చ.. దీంతో అపూర్వ లఖియా క్లారిటీ ఇచ్చారు.
జంజీర్ అట్టర్ ప్లాప్ అయ్యింది. దీంతో చెర్రీ (Charan) అపూర్వను దూరం పెట్టారట.. దీనిపై అపూర్వ (Apoorva) మాట్లాడారు. తనకు చెర్రీతో విభేదాలు లేవని చెప్పారు. ఇప్పుడు ఆయన సినిమాలతో బిజీగా ఉన్నారెమో అని చెబుతున్నారు. తాను ఫోన్ (phone) చేస్తే కూడా ఎత్తడం లేదన్నాని చెప్పారు. దీంతో నిప్పు లేనిదే పొగ ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్న వస్తోంది. అందుకు అపూర్వ (Apoorva) సమర్థించుకున్నారు. గతంలో కూడా చరణ్ (charan) ఫోన్ తీసేవాడు కాదని చెప్పాడు. అతని కాల్స్ ఉపాసన (upasana) ఆన్సర్ చేసేదని అంటున్నారు. జంజీర్ మూవీ తర్వాత కూడా చరణ్త ఫ్రెండ్ షిప్ కొనసాగిందని వివరించారు. హైదరాబాద్ వచ్చిన సమయంలో చెర్రీ ఇంట్లో చాలా రోజులు ఉన్నానని గుర్తుచేశారు. ఇప్పుడు హైదరాబాద్ (hyderabad) వెళ్లినా.. చరణ్‌ను తప్పకుండా కలుస్తానని తెలిపారు.
ఆర్ఆర్ఆర్ మూవీ ఉక్రెయిన్‌లో షూటింగ్ జరుగుతున్న సమయంలో చరణ్ (charan) తనకు ఫోన్ చేశాడని వివరించారు. యాక్షన్ సీక్వెన్స్ గురించి డిస్కష్ చేశాడని తెలిపాడు. ఆ తర్వాత మాత్రం టచ్‌లో లేడని వివరించారు. దీంతో నిజంగానే సందేహాలు వస్తున్నాయి. వారి మధ్య విభేదాలు ఉన్నాయని అర్థం అవుతోంది.