ఇప్పటి వరకు రిలీజ్ చేసిన సలార్ లుక్స్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో చూస్తున్నారు. ఒక్క ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. మూవీ లవర్స్ అంతా సలార్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో.. సలార్ పై భారీ అంచనాలున్నాయి. దాంతో ఈ సినిమాకు భారీ డిమాండ్ ఉంది. అందుకే ఓ రెండు ఆడియో సంస్థలు గట్టిగా పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది.
కెజియఫ్ లాంటి భారీ యాక్షన్ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ సలార్. సెప్టెంబర్ 28న సలార్ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. షూటింగ్ కంప్లీట్ అయిపోగానే.. పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీ కానున్నాడు ప్రశాంత్ నీల్. అయితే ఇప్పటికే సలార్ బిజినెస్ స్టార్ట్ అయినట్టు వార్తలొచ్చాయి. ముఖ్యంగా ఓవర్సీస్లో భారీ డిమాండ్ ఏర్పడిందని.. అక్కడ ఇప్పటి వరకు ఏ సినిమాకు జరగని బిజినెస్ సలార్‌కు జరిగినట్టు సమాచారం.
ఇక ఓటిటి సంస్థలు అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్.. సలార్ కోసం 200 కోట్ల ఆఫర్ ఇచ్చినట్టు టాక్. అలాగే థియేట్రికల్ రైట్స్‌కు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఒక్క ఏపీ థియేట్రికల్ రైట్స్ కోసమే 100 కోట్ల ఆఫర్ వచ్చినట్టు గతంలో వార్తలొచ్చాయి. ఒక్క ఏపికే ఇంత డిమాండ్ ఉంటే.. మిగతా ప్రాంతాల్లో సలార్ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరగడం పక్కా అంటున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఆడియో రైట్స్‌కు భారీ పోటీ ఉన్నట్టు తెలుస్తోంది.
సలార్ ఆడియో హక్కుల కోసం రెండు బడా మ్యూజిక్ సంస్థలు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. సోనీ మ్యూజిక్ మరియు లహరి మ్యూజిక్ వారు.. సలార్ ఆడియో కోసం నువ్వా నేనా అంటున్నాయట. ఈ సినిమాకు కెజియఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను.. హోంబలే ఫిలింస్ దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తోంది. మరి సలార్ ఆడియో రైట్స్ ఎంతకి అమ్ముడు పోతాయో చూడాలి.