»Bandla Ganesh Settlement Became A Hot Topic Venky
Bandla Ganesh: బండ్లన్న సెటిల్మెంట్ పై ఓ రేంజ్లో ఫైర్!
బండ్ల గణేష్(Bandla Ganesh) ఎవ్వరినైనా టార్గెట్ చేశాడంటే.. కొన్ని రోజులు సోషల్ మీడియా హోరెత్తి పోవాల్సిందే. రీసెంట్గా ఇండైరెక్ట్‌గా త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను టార్గెట్ చేసిన బండ్లన్న.. ఇప్పుడు ఓ వెబ్ సైట్‌పై దారుణాతి దారుణంగా ట్వీట్స్ చేశాడు. తాజాగా ఆయన చేసిన ట్వీట్స్ షాక్ ఇచ్చేలా ఉన్నాయి.
గత కొన్నాళ్లుగా త్రివిక్రమ్ పై సందర్భం వచ్చినప్పుడల్లా ఫైర్ అవుతునే ఉన్నాడు బండ్ల గణేష్(Bandla Ganesh). రీసెంట్గా మరోసారి త్రివిక్రమ్ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారింది. గురూజీని కలిసి కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తే ప్రొడ్యూసర్ అయ్యిపోవచ్చని చెప్పాడు బండ్లన్న. అక్కడి నుంచి మొదలైన బండ్లన్న సోషల్ మీడియా ఫైరింగ్ ఇంకా సాగుతునే ఉంది. ఈ వివాదంలో తెరవెనక ఏదో జరిగిందని ఓ ఆర్టికల్ వచ్చింది.
వివాదాల్ని ఇలా రేపడం, అలా వదిలేయడం బండ్ల గణేశ్‌కు బట్టర్‌తో పెట్టిన విద్య.. పైకి చెప్పకపోయినా, ఆయనకు ఏదో న్యాయం జరుగుతుంది. అందుకే ఈ వివాదం మొదలుపెట్టిన రెండు రోజులకే సైలెంట్ అయ్యాడు. మొత్తంగా తెరవెనక ఈ వివాదం సెటిల్ అయి ఉండొచ్చంటూ.. అనే ఆర్టికల్ ఒకటి బయటికొచ్చింది. దీనిపై బండ్లన్న ఓ రేంజ్లో ఫైర్ అయ్యాడు. అరే అని మొదలు పెట్టి.. నువ్వు పెద్ద బ్రోకర్, ఇక్కడ ఉన్నవాడు చిన్న బ్రోకర్. నీలి వార్తలు రాసుకొని, నీలి బతుకులు బతుకుతూ.. దొంగచాటుగా తిరిగే మీకు మా గురించి ఎందుకురా లఫుట్. మేము ప్రేమిస్తాం, పూజిస్తాం, ప్రాణం ఇస్తాం, కోపం వస్తే అలుగుతాం. ప్రేమించినప్పుడు, పూజించినప్పుడు అలిగే హక్కు కూడా ఉంటుందిరా లఫుట్.
సినిమా వాళ్ళ వార్తలు, సినిమా వాళ్ళ ఇంటర్వ్యూలు లేకపోతే నీకు పప్పం గడవదురా వెంకీగా. నువ్వు మనిషివైతే నీకు సిగ్గు, శరం ఉంటే నువ్వు తినేది అన్నమే అయితే.. ఒక్కసారి ప్రత్యక్షంగా నాకు కనపడు. నీలీ వార్తలు రాసుకునే నీ బతుకు.. నీ ఇంట్లో నువ్వు లేనప్పుడు జరుగుతున్న నీలి చిత్రాలు గురించి చూసుకోరా బఫున్ కొడకా.. నిజాయితీగలడితో దూరంగా ఉండటానికి ప్రయత్నించు. నీతిగా బతికేవాడి జోలికి రాకు.. అని రాసుకొచ్చాడు. అంతేకాదు.. ఆ తర్వాత సదరు సైట్‌ని బ్యాన్ చేయాలని.. సినిమా వాళ్లను కాపాడుకుందామని వరుస ట్వీట్స్ చేశాడు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.