సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందుకొని.. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోగా, సూపర్ స్టార్‌గా దూసుకుపోతున్నాడు మహేష్ బాబు. ఇక మహేష్ బాబు లెగసీని కంటిన్యూ చేసేందుకు.. ఆయ కుమారుడు గౌతమ్ రెడీ అవుతున్నాడు. తాజాగా గౌతమ్(Gautham) తెరంగేట్రం ఎప్పుడుంటుంది? అనే విషయంలో నమ్రత(namratha) క్లారిటీ ఇచ్చింది.
తమ అభిమాన హీరోల వారసులు.. ఎప్పుడెప్పుడు హీరోలుగా ఎంట్రీ ఇస్తారా అని.. ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతానికి టాలీవుడ్లో బాలయ్య, పవన్ కళ్యాణ్, రవితేజ, మహేష్ వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. కాస్త లేట్ అయినా కూడా.. వీళ్లు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం ఖాయమని గట్టిగా నమ్ముతున్నారు ఫ్యాన్స్. అయితే..ఇప్పుడు గౌతమ్(Gautham) ఎంట్రీ ఎప్పుడుంటుందనే విషయంలో.. ఓ న్యూస్ వైరల్‌గా మారింది. 1 నేనొక్కడినే సినిమాలో కీలక పాత్ర పోషించాడు మహేష్ కొడుకు గౌతమ్. అప్పుడే గౌతమ్ హీరో అని ఫిక్స్ అయిపోయారు ఘట్టమనేని అభిమానులు. అయితే అప్పుడప్పుడు మహేష్ కూతరు సితార సోషల్ మీడియా(social media)లో సందడి చేస్తుంటుంది.. కానీ గౌతమ్ మాత్రం కాస్త సైలెంట్‌గా ఉంటాడు.. ఎక్కడా ఎక్కువగా కనిపించడు.. ఎక్కువగా మాట్లాడడు.
కానీ తండ్రికి తగ్గ తనయుడిగా.. 8 ఏళ్ల వయసులోనే ‘వన్ నేనొక్కడినే’ చిత్రంలో నటించాడు గౌతమ్. ఈ సినిమా ఫ్లాప్ అయినా కూడా.. మహేష్, గౌతమ్‌ను బిగ్ స్క్రీన్ పై చూసి మురిసిపోయారు అభిమానులు. ఇక ఆ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు గౌతమ్. కానీ.. అప్పుడప్పుడు బయటికొచ్చే గౌతమ్ కటౌట్ చూసి.. అచ్చం మహేష్ బాబులా ఉన్నాడనే కామెంట్స్ అందుకుంటున్నాడు. ప్రస్తుతం గౌతమ్ లండన్‌లో చదువుకుంటున్నాడు. కాబట్టి గౌతమ్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ఇంకా చాలా సమయం ఉంది. స్టడీస్ కంప్లీట్ అయ్యాకే హీరో(hero)గా ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే.. తాజాగా మహేశ్ భార్య నమ్రత(namratha).. గౌతమ్ ఎంట్రీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం గౌతమ్ దృష్టి చదువుపైనే ఉందన్నారు. ఇంకో ఆరేడు సంవత్సరాల తర్వాతే సినిమాల్లోకి వస్తాడని చెప్పారు. ఈ లెక్కన గౌతమ్ ఎంట్రీ 2030లో ఉంటుందనే చెప్పాలి.