బాలయ్య అన్ స్టాపబుల్ షో సూపర్ హిట్ అయ్యింది. మొదటి సీజన్ సక్సెస్ కావడంతో… సెకండ్ సీజన్ మరింత సూపర్ డూపర్ గా దూసుకుపోతంది. సెకండ్ సీజన్ లో ఊహించని విధంగా ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్లు వచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ నాయుకులు కూడా వచ్చారు. కాగా… తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఈ షోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి కేటీఆర్ తో పాటు హీరో రామ్ చరణ్ కూడా రానున్నారట.
ఈ సంక్రాంతికి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ షో కోసం ఇటు అభిమానులతో పాటు అటు రాజకీయ వర్గాలవారు కూడా ఎదురుచూస్తున్నారు. ఇది కంప్లీట్ అయిన వెంటనే… చరణ్, కేటీఆర్ ఎపిసోడ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. అటు సినిమా, ఇటు పాలిటిక్స్.. రెండింటిని బాలయ్య ఏ రేంజ్ లో బ్యాలెన్స్ చేస్తారనేది చూడాలి.