మెగా, అల్లు ఫ్యామిలీ గురించి ఏదో పుకారు వినిపిస్తునే ఉంటుంది. ముఖ్యంగా అల్లు అర్జున్.. మెగా బ్రాండ్‌ను పక్కకు పెట్టి.. అల్లు బ్రాండ్‌తో సాగుతున్నాడని.. ఫ్యాన్స్ రచ్చ చేస్తునే ఉన్నారు. ఆ మధ్యన అయితే సోషల్ మీడియాలో అల్లు, మెగా వార్ ఊహించని విధంగా జరిగింది. దారుణమై కామెంట్లతో రెచ్చిపోయారు ఫ్యాన్స్. అసలు సమయం సందర్భం లేకుండా ఇరు కుటుంబాల మధ్య రూమర్లు వస్తూనే ఉన్నాయి. దీనిపై ఇటు అల్లు వారుగానీ, మెగా ఫ్యామిలీ గానీ ఎప్పుడు స్పందిచలేదు. ఆ మధ్యలో అల్లు అరవింద్ మాత్రం క్లారిటీ ఇచ్చారు. బయట జరిగే ప్రచారంలో నిజం లేదని తెల్చేశారు. అలాగే ఫెస్టివల్స్ సమయంలో ఇరు కుటుంబ సభ్యులు కలిసి సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పారు. దాంతో మెగా, అల్లు పుకార్లు ఫ్యాన్స్ మరియు సోషల్ మీడియాకే పరిమితం.. మెగా హీరోలకు మాత్రం కాదని తేలిపోయింది. తాజాగా మరోసారి అదే నిరూపించారు మెగా బ్యాచ్. మెగా, అల్లు ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఒక్కచోట కలిశారు. క్రిస్మస్ సందర్భంగా శాంటా సెలెబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. అయితే ఈ జనరేషన్ వాళ్ళు మాత్రమే ఇందులో పాల్గొన్నారు. ఒక్కోసారి రామ్ చరణ్, అల్లు అర్జున్ షూటింగ్‌ల వల్ల ఇలాంటి వాటికి మిస్ అవుతుంటారు. అది కూడా విదేశాలకు వెళ్లినప్పుడే అలా జరుగుతుంది. కానీ ఈ సారి మాత్రం చరణ్, బన్నీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి కనువిందు చేశారు. ఇక మెగా కుటుంబంలో ఉన్న హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్‌తో పాటు మిగతా కుటుంబ సభ్యులు కలిసి సీక్రెట్ శాంటా క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ మెగా ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోని షేర్ చేస్తూ.. మెగా కజిన్స్ సీక్రెట్ శాంటా అని క్యాప్షన్ ఇచ్చాడు రామ్ చరణ్.