Mahesh Vs Ravi Teja : సూపర్ స్టార్ మహేష్ బాబుతో.. మాస్ మహారాజా రవితేజ పోటీ పడబోతున్నాడానే న్యూస్.. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇటీవలే బ్యాక్ టు బ్యాక్ సాలిడ్ హిట్స్ అందుకున్నాడు రవితేజ.
సూపర్ స్టార్ మహేష్ బాబుతో.. మాస్ మహారాజా రవితేజ పోటీ పడబోతున్నాడానే న్యూస్.. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇటీవలే బ్యాక్ టు బ్యాక్ సాలిడ్ హిట్స్ అందుకున్నాడు రవితేజ. ధమాకా 100 కోట్లు, వాల్తేరు వీరయ్య 250 కోట్లు రాబట్టి మాస్ రాజా స్టామినా ఏంటో చూపించాయి. దీంతో అప్ కమింగ్ ఫిల్మ్స్‌ను ఫుల్ జోష్‌లో ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు మాస్ రాజా. ముందుగా సుధీర్ వర్మ తెరకెక్కస్తున్న రావణాసురను ఏప్రిల్ 7న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాతో మాస్ రాజా మరో హిట్ కొట్టేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఆ తర్వాత పాన్ ఇండియా ప్రాజెక్ట్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. వంశీ దర్శకత్వంలో స్టూవర్టుపురం గజదొంగ బయోపిక్ ఆధారంగా ‘టైగర్ నాగేశ్వరరావు’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాను ఆగష్టు 11న రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. కానీ అదే రోజున మహేష్, త్రివిక్రమ్ SSMB 28 రిలీజ్ చేయబోతున్నట్టు.. నిర్మాత నాగవంశీ ఇప్పటికే చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు కూడా అదే రోజు రిలీజ్ అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. మహేష్‌తో రవితేజ పోటీ పడే అవకాశాలు తక్కువ. ఎందుకంటే.. ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్ అనుకున్న సమయానికి మొదలు పెట్టలేకపోయారు. దాంతో ఆగష్టు 11న రావడం కష్టమే అంటున్నారు. ఒకవేళ షూటింగ్ ఫాస్ట్‌గా జరిగితే మాత్రం రిలీజ్ పక్కా. అదే జరిగితే టైగర్ నాగేశ్వరరావు రిస్క్ చేస్తాడా.. అనేది ఆసక్తికరంగా మారింది. కాబట్టి.. ఇప్పుడే మహేష్ వర్సెస్ రవితేజ అని చెప్పలేం. చూద్దాం ఏం జరుగుతుందో!