మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ మధ్య ఫ్యాన్ వార్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సారి మాత్రం ఈ ఇద్దరి మధ్య పోటీ గట్టిగానే ఉంది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి.. ఒకే బ్యానర్లో తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాలు సంక్రాంతి కానుకగా ఒకరోజు గ్యాప్‌తో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నాయి. అందుకే ఇద్దరు హీరోలను బ్యాలెన్స్ చేస్తూ.. ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్. ఇప్పటికే ఫస్ట్ లుక్ మొదలుకొని టీజర్, సాంగ్స్‌ను పోటా పోటీగా రిలీజ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ కూడా దాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదంతా మేకర్స్‌కు కలిసొచ్చే అంశమే. అయితే చిరు, బాలయ్య ప్రస్తుతం తమ బ్యానర్లోనే ఉన్నారు కాబట్టి.. ఇద్దరినీ కలిపి ప్రమోషన్స్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉందట మైత్రీ సంస్థ. ఇప్పటికే ‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్ స్టార్ట్ చేయగా.. త్వరలోనే బాలయ్య రంగంలోకి దిగబోతున్నాడు. ఈ క్రమంలో చిరు, బాలయ్య కలిసి ఒకే ఫ్రేమ్‌లోకి రాబోతున్నట్టు సమాచారం. ఈ ఇద్దరు స్టార్స్‌తో ఓ ఇంటర్వ్యూ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు.. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి ప్రమోషన్ని ఒకే వేదికపై నిర్వహించనున్నట్టు టాక్. ఒకవేళ నిజంగానే చిరు, బాలయ్య కలిస్తే మాత్రం.. ఫ్యాన్స్‌కు ఇదే అసలైన పండగ. అయితే దీనికి చిరు, బాలయ్య ఒప్పుకుంటారా.. అనే డౌట్స్ వస్తున్నాయి. కానీ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. కాబట్టి ఈ సారి చిరు, బాలయ్య సెన్సేషన్ క్రియేట్ చేసేలానే ఉన్నారు. ఆ ఘనత కూడా మైత్రీకే దక్కుతుందని చెప్పొచ్చు. అయితే ఇలాంటి వార్తల్లో ఎంతవరకు నిజముందనేది ఇప్పుడే చెప్పలేం. ఏదేమైనా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి పై రోజు రోజుకు అంచనాలు పెరుగుతునే ఉన్నాయి. మరి ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలా సందడి చేస్తాయో చూడాలి.