Rashmika: ఎప్పుడో పెళ్లైపోయింది.. బ్యూటీ హాట్ కామెంట్స్
మీరు వింటున్నది నిజమే.. తనకు ఎప్పుడో పెళ్లైపోయిందని చెప్పి షాక్ ఇచ్చింది నేషనల్ క్రష్ రష్మిక. అసలు రష్మికకు పెళ్లైపోవడం ఏంటి? అతనెవరు? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కానీ రష్మిక చేసిన కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటి?
Rashmika: తెలుగులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హిట్ సీక్వెల్ ‘పుష్ప2’లో నటిస్తోంది రష్మిక. ‘రెయిన్బో’ అనే లేడీ ఓరియెంటేడ్ ప్రాజెక్ట్ కూడా చేస్తోంది. మరోవైపు బాలీవుడ్లో జెండా పాతేందుకు గట్టిగా ట్రై చేస్తోందిః. ఇప్పటికే గుడ్ బై, మిస్టర్ మజ్ను చిత్రాలతో బాలీవుడ్లో లక్ టెస్ట్ చేసుకుంది. ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చేతులెత్తేశాయి. అయినా రష్మికకు బాలీవుడ్లో గట్టి డిమాండ్ ఏర్పడుతోంది. ప్రస్తుతం అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘యానిమల్’ సినిమాలో రణ్ బీర్ కపూర్‌తో కలిసి నటిస్తోంది. ఇంకా కొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.
రీసెంట్గా వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న సినిమా నుంచి తప్పుకుంది. మొత్తంగా ప్రస్తుతం రష్మిక కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఇలాంటి సమయంలో రష్మిక పెళ్లి మ్యాటర్ హాట్ టాపిక్‌గా మారింది. గీతా గోవిందం సినిమా నుంచి రౌడీ హీరో విజయ్ దేవరకొండతో రష్మిక లవ్‌లో ఉందనే రూమర్స్ ఉన్నాయి. ఎక్కడికెళ్లినా ఈ ఇద్దరు కలిసే వెళ్తుంటారు. ఎప్పటికప్పుడు తామ్ జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని పుకార్లను కొట్టిపారేస్తున్నారు. అయినా కూడా ఇద్దరి మధ్య ఏదో ఉందనేది నెటిజన్స్ మాట. కానీ రష్మిక మాత్రం మరో వ్యక్తితో తనకు పెళ్లైపోయిందంటూ.. షాకింగ్ కామెంట్స్ చేసింది.
రీసెంట్గా ఓ బాలీవుడ్ ఈవెంట్లో చెప్పుకొచ్చింది. మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు? పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు..? అనే ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది. ‘నాకు ఎప్పుడో నరుటోతో పెళ్లైపోయింది. నా మనసులో అతడే ఉన్నాడు’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఎవరా నరుటో? అనే చర్చ జరుగుతోంది. నరుటో అనేది ప్రముఖ జపనీస్ వెబ్ సిరీస్‌లోని పాత్ర పేరు. ఈ సిరీస్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అందులో రష్మిక కూడా ఒకరని.. ఈ కామెంట్స్‌తో తెలిసిపోయింది. అసలు రష్మిక మనసులో ఎవరున్నారనేది.. ఎప్పటికీ హాట్ టాపికే.