Huge Plan for SSMB 28. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబీ 28 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే చాలా రోజులుగా ఈ సినిమా షూటింగ్ డిలే అవుతు వస్తోంది.
Huge Plan for SSMB 28. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబీ 28 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే చాలా రోజులుగా ఈ సినిమా షూటింగ్ డిలే అవుతు వస్తోంది. అప్పుడెప్పుడో షూటింగ్ మొదలు పెట్టినా.. మధ్యలో కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. అయితే ఎట్టకేలకు ఇటీవలే తిరిగి షూటింగ్ మొదలైంది. అంతేకాదు ఓ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది. మహేష్ ఈ సినిమాను నాన్‌స్టాప్‌గా షూటింగ్ చేయాలని భావిస్తున్నాడు. అందుకే ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా నెక్స్ట్ షెడ్యూల్‌కు రెడీ అవుతున్నాడు. ఈ నెల 20 నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారట. అయితే ఈ షెడ్యూల్ కోసం ఓ భారీ ఇంటి సెట్ వేస్తున్నారట. అందుకోసం దాదాపుగా 10 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. మామూలుగా త్రివిక్రమ్ సినిమా అంటేనే.. అందమైన, అద్భుతమైన ఇల్లు ఉండాల్సిందే. గతంలో అత్తారింటికి దారేది, అల వైకుంఠపురంలో సినిమాల్లోని ఇల్లు ఆడియెన్స్‌ను కట్టిపడేశాయి. అయితే ఈసారి మాత్రం రియల్ హౌజ్ కాకుండా.. భారీ సెట్ వేస్తున్నారట. అందులో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించబోతున్నారట. ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే రాజమౌళి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నాడు మహేష్ బాబు. అందుకే ఎస్ఎస్ఎంబీ 28ని పరుగులు పెట్టిస్తున్నాడు. జూన్‌కు అటు ఇటుగా ఈ సినిమా లాంచ్ అవనుందని తెలుస్తోంది. మరి ఎస్ఎస్ఎంబీ 28.. రాజమౌళి సినిమాకు ఎలాంటి బూస్టింగ్ ఇస్తుందో చూడాలి.