ఒక అభిమాని ఎప్పుడైనా డైరెక్టర్ అయితే మాత్రం.. అతను చూపించినట్టుగా ఎవరూ మనల్ని చూపించలేరు.. ఇక్కడున్న ప్రొఫెషనల్ రైటర్స్ కంటే.. తెరపై ఎలా చూపించాలో వాళ్లకే ఎక్కువగా తెలుసు.. ఒకవేళ అలాంటి అవకాశమొస్తే ఖచ్చితంగా సినిమా చెయ్యాలని.. తాజాగా జరిగిన వాల్తేరు వీరయ్య ప్రెస్మీట్లో చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం మెగాస్టార్ చేస్తున్న వాల్తేరు వీరయ్య.. చిరు వీరాభిమాని బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. బాబీ మాటల్లో చెప్పాలంటే.. చిరంజీవి అంటే అతనికో ఆరాధ్య దైవం. అలాంటిది ఏకంగా తన దేవున్నే డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.. ఇదే విషయాన్ని పదే పదే చెబుతూ పూనకాలు లోడింగ్ అంటున్నాడు బాబీ. అందుకు తగ్గట్టే.. ఈ సినిమా గురించి ఎంతైనా ఊహించుకోండి.. దానికి మించే ఉంటుందని.. అంచనాలను పెంచుతునే ఉన్నారు చిరు. ఇలా వాల్తేరు వీరయ్య గురించి ప్రతి ఒక్కరు హైప్ ఇచ్చేలా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా డైరెక్టర్ బాబీ.. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే 8 నిమిషాలు థియేటర్లలో అభిమానులకు పూనకాలను తెప్పిస్తుందని అంటున్నాడు. అలాగే మెగాస్టార్ యుద్ధంలోకి దిగితే ఎలా ఉంటుందో.. ఈ సినిమా అలాగే ఉంటుందని అన్నాడు. ఇక ఇంట్రో సీన్ అయితే తుఫాన్‌లా ఉంటుందంటున్నాడు. పైగా ఇందులో మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో యుద్ధాన్ని తలపించేలా హై ఓల్టేజ్ సీన్ పడితే.. వాల్తేరు వీరయ్య నెక్స్ట్ లెవల్లో ఉంటుందని అంటున్నారు. మరి ఆ సీన్ ఎలా ఉంటుందో తెలియాలంటే.. జనవరి 13 వరకు ఆగాల్సిందే.