»Hero Nani Said Myself In Santosh At Anni Manchi Sakunamule Movie
Nani: సంతోష్ లో నన్ను నేను చూసుకున్నాను
తన కెరీర్లో నిజంగా చెప్పుకోదగ్గ చిత్రంగా 'అలా మొదలైంది' చిత్రమని ఈ సందర్భంగా నాని(nani) అన్నారు. నందిని రెడ్డి నిస్సందేహంగా అప్పటి నుంచి చాలా ముందుకు వచ్చారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అన్నీ మంచి శకునములే(anni manchi sakunamule) చిత్రానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
యువ నటుడు సంతోష్ శోభన్ తదుపరి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నీ మంచి శకునములే(anni manchi sakunamule). నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాళవిక నాయర్ కథానాయిక. ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ సినిమా మే 18న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్(hyderabad)లో జరిగింది. ఈ కార్యక్రమానికి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాని(nani) మాట్లాడుతూ ఈ సినిమా మంచి హిట్ అవుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ క్రమంలో వైజయంతీ ఫిల్మ్స్‌తో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. అన్నీ మంచి శకునములే సాంకేతిక బృందానికి నాని అభినందనలు తెలియజేశారు. దీంతోపాటు ఈ మూవీ ట్రైలర్, పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయని అన్నారు. ఈ సినిమాకి నేను చీఫ్ గెస్టును అంటూ నా పేరు వేసి వెల్ కమ్ చెప్పారు గానీ, నిజానికి నేను ఆ ఫ్యామిలీకి చెందినవాడినేనని పేర్కొన్నారు. నా సినిమా ‘అలా మొదలైంది’తోనే నందినీ రెడ్డిగారి కెరియర్ మొదలైంది. అప్పటికీ, ఇప్పటికీ ఆమె ఎంతో ఎదిగిపోయారు. ఈ సినిమా విషయంలో ఆమెలోని మెచ్యూరిటీ లెవెల్స్ మరింత బలంగా కనిపిస్తున్నాయని వెల్లడించారు.
సంతోష్ శోభన్‌లో నన్ను నేను చూస్తున్నాను అని నాని చెప్పారు. ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుందని భావిస్తున్నట్లు నేచురల్ స్టార్(natural star) తెలిపారు. సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లి టైటిల్‌ను ప్రేక్షకుల మదిలో మెదిలేందుకు స్వప్న దత్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారని నాని అన్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో సౌకార్ జానకి, రాజేంద్ర ప్రసాద్, గౌతమి, రావు రమేష్, నరేష్, వెన్నెల కిషోర్, వాసుకి, రమ్య సుబ్రమణియన్, అంజు అల్వికా నాయక్ కీలక పాత్రలు పోషించారు.
ఇది కూడా చూడండి: Ram Charan fans: మండు వేసవిలో మజ్జిగ పంపిణీ