ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ 30 అప్డేట్.. ఎట్టకేలకు న్యూ ఇయర్ కానుకగా ఇచ్చేశారు. అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్నప్పుడే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం విశేషం. ఎన్టీఆర్30 మూవీని 2024 ఉగాది కానుకగా.. ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. రెగ్యులర్ షూటింగ్ వచ్చేసి ఫిబ్రవరి నుంచి ప్రారంభం కాబోతున్నట్లు చెప్పారు. ఈ సిందర్భంగా.. కత్తి పట్టుకున్న పోస్టర్ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ విషయంలో తారక్ ఫ్యాన్స్ హ్యాపీగానే ఉన్నా.. అదే రేంజ్లో డిసప్పాయింట్ అవుతున్నారు. అరవింద సమేత తర్వాత ఆర్ఆర్ఆర్ కోసం దాదాపు నాలుగేళ్ల సమయం తీసుకున్నాడు తారక్. అయితే కరోనా వల్ల ఈ ప్రాజెక్ట్ డిలే అయిందంటే ఓకే. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ 30 కోసం రెండేళ్లకు పైగా తీసుకోవడంతో తారక్ ఫ్యాన్స్ అసహనంగా ఉన్నారు. ఈ లెక్కన ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ రావాలంటే మరో రెండేళ్లకు పైగా ఎదురు చూడాల్సిందేనా.. అని అంటున్నారు. మొత్తంగా తమ హీరోని బిగ్ స్క్రీన్ పై చూడాలంటే మరో సంవత్సరానికి పైగా ఎదురు చూడాల్సిందేనా.. అని వాపోతున్నారు నందమూరి ఫ్యాన్స్. అయితే లేట్ అయినా కానీ.. లేటెస్ట్గా రావాలని అంటున్నారు. ఇకపోతే.. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. మరి ఎన్టీఆర్ 30 ఎలా ఉంటుందో చూడాలి.