సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డితో పోటీ పడేందుకు సై అంటున్నాడు ‘వారసుడు’. కాకపోతే అతను తమిళ్ వారసుడు కావడంతో.. చిరు, బాలయ్యను తట్టుకుంటాడా అనే సందేహాలు వెలువడుతున్నాయి. కానీ వారసుడు వెనకలా మాస్టర్ మైండ్ దిల్ రాజు ఉండడంతో.. గట్టి పోటీ ఇవ్వడం ఖాయమంటున్నారు. అందుకే వారసుడు ప్రమోషన్స్‌ను అంతకుమించి అనేలా ప్లాన్ చేస్తున్నారట దిల్ రాజు. వారసుడు చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే జోరుగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. అందులోభాగంగా.. వారసుడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారట. చెన్నైలో ఈ నెల 24న.. తెలుగులో 27న ఈవెంట్ ప్లానింగ్‌లో ఉన్నారట. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని ముఖ్య అతిధిగా పిలవబోతున్నారని సమాచారం. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. పవన్ ఈ ఈవెంట్‌కు వస్తే సినిమా పై భారీ హైప్ రావడం పక్కా అని చెప్పొచ్చు. గతంలో విజయ్, పవన్ ఒకే వేదికను పంచుకున్న సందర్భాలు ఒకటి అరా మాత్రమే.. అలాంటి ఈ బిగ్ స్టార్స్ ఇప్పుడు స్టేజ్‌ను పంచుకుంటే.. ఫ్యాన్స్‌కు పండగేనని చెప్పొచ్చు. పైగా పవర్ స్టార్‌కి విజయ్ చాలా పెద్ద ఫ్యాన్ అని పలు సందర్భాలలో చెబుతుంటాడు. కాబట్టి వారసుడు ఈవెంట్ అదిరిపోతుందని చెప్పొచ్చు. ఇక వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో.. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది.