T-series: తన సినిమా హిట్ అవ్వాలని నిర్మాత కోరుకుంటాడు. ఆస్తులు అమ్మి అయినా సినిమాలు తీస్తుంటాడు. వరసగా రెండు, మూడు ప్లాప్ లు పడి దీవాళా తీసిన నిర్మాతలు చాలా మందే ఉన్నారు. టీ సిరీస్ లాంటి పెద్ద ప్రొడక్షన్ హౌస్ ట్రాక్ రికార్డు మాత్రం మరోలా ఉంది. మొత్తం 30 సినిమాలు తీస్తే, దాంట్లో ఇప్పటి వరకు 3 సినిమాలు మాత్రమే హిట్ కావడం విశేషం.
భూషణ్ కుమార్ టీ సీరిస్ సంస్థకు యజమాని. ఆయన నిర్మాతగా, గత మూడేళ్ళలో 30 సినిమాలు నిర్మించగా, మూడు సినిమాలు తప్ప మిగిలినవన్నీ ఫ్లాప్, వాష్ అవుట్ అయ్యాయి. ఇన్ని ఫ్లాప్‌లలో పెట్టుబడి పెట్టడానికి వారికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందనేది మిస్టరీ. వాటిలో అతిపెద్ద ఫ్లాప్‌లు రాధే శ్యామ్, విక్రమ్ వేద, ముంబై సాగా, షెహజాదా, సర్కస్, భోలా, ఏక్ విలన్ రిటర్న్స్ ఇలా పెద్ద లిస్టే ఉంది. తాన్హాజీ, భూల్ భూలయ్యా 2 , దృశ్యం 2 మాత్రమే మూడు హిట్ చిత్రాలు.
బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫేర్‌గా నిలిచిన చిత్రాలలో తు ఝూటీ మైన్ మక్కర్ ఒకటి. వీరి తాజా చిత్రం ఆదిపురుష్ మొదటి వారాంతంలో హిందీలో 100 కోట్ల నెట్ వసూళ్లతో మంచి వసూళ్లను రాబట్టింది. తర్వాత కలెక్షన్లు తగ్గాయి. T-సిరీస్ తదుపరి చిత్రం రణబీర్ కపూర్ యానిమల్తో వస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా హిట్ అవుతుందని నిర్మాణ సంస్థ ఎన్నో ఆశలు పెట్టుకుంది.