NZB: చందూరు మండల కేంద్రంలోని మైనారిటీ గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సీహెచ్ రాఘవ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 8 నుంచి 10 వరకు పెద్దపల్లి జిల్లాలో జరిగే పోటీల్లో ఆయన నిజామాబాద్ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని ప్రిన్సిపల్ నరేష్ కుమార్ శుక్రవారం తెలిపారు.