GNTR: తుఫాన్ కారణంగా గత నెలలో ఇచ్చిన 4 రోజుల సెలవులను భర్తీ చేయడానికి జిల్లా విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా, డీఈవో సీ.వీ రేణుక వచ్చే ఎడాది ఫిబ్రవరి నెల వరకు రెండో శనివారం సెలవులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 వరకు ఉన్న నాలుగు రెండో శనివారాలు విద్యా సంస్థలు తప్పనిసరిగా నడవాలని డీఈవో ఆదేశించారు.